Loading...
Houthi Attacks Saudi: రియాద్, ఆభా విమానాశ్రయాలపై హూతీల దాడులు.. తీవ్రంగా ఖండించిన భారత్
రియాద్, ఆభా విమానాశ్రయాలపై హూతీల దాడులు.. తీవ్రంగా ఖండించిన భారత్

Houthi Attacks Saudi: రియాద్, ఆభా విమానాశ్రయాలపై హూతీల దాడులు.. తీవ్రంగా ఖండించిన భారత్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2026
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

సౌదీ అరేబియాపై హూతీ తిరుగుబాటుదారుల దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. రియాద్, ఆభా విమానాశ్రయాలపై డ్రోన్లు, క్షిపణులతో జరిగిన దాడుల్లో పలువురు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. ఇదే సమయంలో పశ్చిమాసియాలో నౌకలపై దాడుల్లో 11 మంది భారత నావికులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్రం వెల్లడించింది.

వివరాలు 

సౌదీ అరేబియాపై హూతీల దాడులు.. భారత్ తీవ్ర ఖండన

సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకుని యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు దాడులు కొనసాగిస్తున్నారు.

సౌదీ రాజధాని రియాద్‌తో పాటు ఆభా నగరంలోని విమానాశ్రయాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిగాయి.

ఈ ఘటనల్లో పౌరులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. సౌదీ అరేబియాపై జరిగిన ఈ దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది.

పౌర మౌలిక సదుపాయాలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడం ఏమాత్రం సమర్థనీయం కాదని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది.

రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఆభాలోని విమానాశ్రయంపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది.

ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పౌరుల కుటుంబాలకు విదేశాంగశాఖ ప్రగాఢ సానుభూతి తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.

వివరాలు 

ఆభా విమానాశ్రయంపై దాడి.. ఇద్దరు మృతి

ప్రస్తుత సంక్షోభ సమయంలో సౌదీ ప్రజలకు, ఆ దేశ ప్రభుత్వానికి భారత్ అండగా ఉంటుందని వెల్లడించింది.

ఆభా విమానాశ్రయంపై ఇటీవల జరిగిన దాడిలో ఇద్దరు మృతి చెందగా.. మరో 28 మంది గాయపడినట్లు సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది.

రియాద్‌లోని విమానాశ్రయంపై జరిగిన మరో దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఎనిమిది మంది గాయపడినట్లు వెల్లడించింది.

మరోవైపు, హూతీ తిరుగుబాటుదారులపై సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు దాడులను కొనసాగిస్తున్నాయి.

యెమెన్‌లో హూతీల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సంకీర్ణ బలగాలు చర్యలు చేపడుతున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

11 మంది భారత నావికులు మృతి

ఇదిలా ఉండగా.. పశ్చిమాసియా ప్రాంతంలో నౌకలపై జరుగుతున్న దాడుల ప్రభావం భారత నావికులపై కూడా పడింది.

ఇప్పటివరకు 11 మంది భారత నావికులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

హర్మూజ్ జలసంధి నుంచి ఇప్పటివరకు 4,200 మంది భారత నావికులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చినట్లు నౌకాయాన (షిప్పింగ్) కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత నావికుల భద్రతపై కేంద్రం చర్యలు కొనసాగిస్తోంది.

ADVERTISEMENT