Dammam International Airport: సౌదీలోని దమ్మామ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హూతీల క్షిపణి దాడి
ఈ వార్తాకథనం ఏంటి
సౌదీ అరేబియా (Saudi Arabia)లోని కీలక విమానాశ్రయాలపై హూతీ రెబల్స్ దాడులకు పాల్పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి దమ్మామ్‌లో ఉన్న కింగ్ ఫహాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో దాడి చేశారు. ఈ ఘటనలో జరిగిన నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. మరోవైపు రాజధాని రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై కూడా రెండో విడత దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దమ్మామ్ విమానాశ్రయం రియాద్‌కు సుమారు 410 కిలోమీటర్ల దూరంలో ఉంది. అరేబియన్ గల్ఫ్ తీరంలో ఉన్న దమ్మామ్ సౌదీ అరేబియాలోని కీలక పారిశ్రామిక నగరాల్లో ఒకటి. ఇక్కడి కింగ్ ఫహాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ముఖ్యమైన ఏవియేషన్ హబ్‌గా సేవలందిస్తోంది.
వివరాలు
సౌదీ విమానాశ్రయాలకు వెళ్లొద్దు.. హూతీల హెచ్చరిక
సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలకు ప్రయాణికులు వెళ్లొద్దని, విమానాలు అక్కడికి రాకూడదని హూతీలు హెచ్చరించారు.
తమపై సౌదీ అరేబియా దాడులు ఆపే వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. సౌదీకి రానున్న రోజుల్లో మరింత భయానక పరిస్థితులు ఎదురుకానున్నాయని హెచ్చరించారు.
చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం: ఇరాన్
సౌదీ అరేబియా, హూతీల మధ్య నెలకొన్న వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సూచించారు.
పొరుగుదేశాలతో యుద్ధాలు చేయాలనే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు.
హూతీలు తమ స్వతంత్ర వైఖరితోనే వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
సౌదీ అరేబియాపై దాడులకు ఇరాన్ ప్రోత్సాహం అందిస్తోందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అరాగ్చీ ఈ వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
దాడులను ఖండించిన తుర్కియే.. యూకే ట్రావెల్ అడ్వైజరీ
రియాద్ విమానాశ్రయంపై జరిగిన దాడిని తుర్కియే తీవ్రంగా ఖండించింది.
ఇటువంటి దాడులు అంతర్జాతీయ చట్టాలకు పూర్తిగా విరుద్ధమని పేర్కొంది. దాడులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేసింది.
ఈ పరిస్థితుల్లో సౌదీ అరేబియాకు తాము పూర్తి మద్దతుగా నిలుస్తామని ప్రకటించింది.
మరోవైపు సౌదీ అరేబియాకు అత్యవసరమైతే తప్ప తమ దేశ పౌరులు ప్రయాణించవద్దని యూకే ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.
ముఖ్యంగా జెడ్డా, దమ్మామ్, మదీనా విమానాశ్రయాలకు వెళ్లే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దమ్మామ్ విమానాశ్రయంపై హూతీల దాడులు..
King Fahd Airport, Dammam#Dammam #KFIA #SaudiArabia pic.twitter.com/5hIFwtNKom
— Summitsoldier (@Summitsoldier) October 11, 2026