Page Loader
Warren Buffett: వారెన్‌ బఫెట్‌ను వారసుడిగా ప్రకటించిన హువర్డ్‌ బఫెట్‌
వారెన్‌ బఫెట్‌ను వారసుడిగా ప్రకటించిన హువర్డ్‌ బఫెట్‌

Warren Buffett: వారెన్‌ బఫెట్‌ను వారసుడిగా ప్రకటించిన హువర్డ్‌ బఫెట్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 14, 2025
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలో ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ తన బెర్క్‌షైర్ హత్‌వే కంపెనీకి తన వారసుడిగా తన రెండో కుమారుడు హువర్డ్ బఫెట్‌ను ఎంపిక చేశారు. ప్రస్తుతం బెర్క్‌షైర్ వ్యాపార సామ్రాజ్యం విలువ ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.86 లక్షల కోట్లు). వారెన్ బఫెట్ 94 ఏళ్ల వయస్సులో ఉన్నారు. తాజాగా ఆయన వాల్‌స్ట్రీట్‌జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సంపదలో ఎక్కువ భాగం కొత్తగా ఏర్పాటు చేసిన ఛారిటబుల్ ట్రస్ట్‌కు వెళుతుందని వెల్లడించారు. తన ముగ్గురు పిల్లలకు అతితక్కువ మొత్తం మాత్రమే ఇస్తారని చెప్పారు. అయితే వారే 140 బిలియన్ డాలర్ల ట్రస్ట్ కార్యచరణలను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. హువర్డ్‌ను వారసుడిగా ఎంపిక చేసిన వారెన్ బఫెట్ తన ముగ్గురు పిల్లలను బలంగా విశ్వసిస్తానని చెప్పారు.

Details

 హువర్డ్ బఫెట్ ఎవరంటే

హువర్డ్ బఫెట్, లేదా హువీ, కాలేజీ తర్వాత తండ్రి అడుగుజాడలో వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాడు. తండ్రి వారన్ బఫెట్ హువర్డ్‌కు ఓ పొలాన్ని కొనుగోలు చేసి ఇచ్చారు. ఈ పొలం ద్వారా అద్దె చెల్లించాలనే కండిషన్‌ను అమలు చేసి, భూమి వినియోగం, వ్యవసాయ విధానాలపై తన దృష్టిని కేంద్రీకరించాడు. 1989లో హువీ కౌంటీ బోర్డు కమిషనర్‌గా చేరారు. తరువాత ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 1993 నుండి హువీ పలు ప్రముఖ కంపెనీల బోర్డుల్లో డైరెక్టర్‌గా పని చేశారు. ఈ సంస్థల్లో బెర్క్‌షైర్, కోక కోలా ఎంటర్‌ప్రైజెస్, లిండ్సే కార్పొరేషన్, స్లోన్ ఇంప్లెమెంట్, కోన్ ఆగ్ర ఫుడ్స్ ఉన్నాయి. అలాగే, ఎనిమిది పుస్తకాలు కూడా రచించారు.