LOADING...
Machine Guns: ఇజ్రాయెల్ నుంచి భారీగా ఆయుధాలు.. త్వరలో భారత్‌కు 40 వేల లైట్ మెషిన్ గన్స్!
ఇజ్రాయెల్ నుంచి భారీగా ఆయుధాలు.. త్వరలో భారత్‌కు 40 వేల లైట్ మెషిన్ గన్స్!

Machine Guns: ఇజ్రాయెల్ నుంచి భారీగా ఆయుధాలు.. త్వరలో భారత్‌కు 40 వేల లైట్ మెషిన్ గన్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 06, 2025
04:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌కు చెందిన రక్షణ సామగ్రి తయారీ సంస్థ ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ (IWI) వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్‌కు సుమారు 40 వేల లైట్ మెషిన్ గన్స్ (LMGs) సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే 1.70 లక్షల కార్బైన్‌ల కొనుగోలు ఒప్పందం కూడా చివరి దశలో ఉన్నట్లు వెల్లడించింది. పిస్టల్స్‌, రైఫిల్స్‌, మెషిన్ గన్స్‌ సహా ఆధునిక రక్షణ ఉత్పత్తులను భారత హోంశాఖకు చెందిన వివిధ ఏజెన్సీలతో మార్కెట్ చేయడానికి తమ సంస్థ సక్రియంగా పనిచేస్తోందని ఐడబ్ల్యూఐ సీఈవో 'షుకి స్క్వాట్జ్' పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

Details

ఇప్పటికే ఆయుధాల పరీక్షలు, తనిఖీలు పూర్తి

గతేడాది ఒప్పందం ప్రకారం 40 వేల LMGలను భారత్‌కు తొలుత అందించేందుకు సిద్ధమవుతున్నాం. ఇప్పటికే ఆయుధాల పరీక్షలు, తనిఖీలు పూర్తయ్యాయి. ఉత్పత్తికి లైసెన్స్ పొందామని, వచ్చే ఏడాది తొలి బ్యాచ్‌ను భారత్‌కు పంపాలని ప్రయత్నిస్తున్నామని ఆయన వివరించారు. అంతేకాదు క్లోజ్ క్వార్టర్స్ బ్యాటిల్ (CQB) కార్బైన్స్ టెండర్‌లో భారత్ ఫోర్జ్ ప్రైమరీ బిడ్డర్‌గా ఉండగా, ఐడబ్ల్యూఐ రెండో స్థానంలో ఉందని చెప్పారు. ఈ ఒప్పందం ఈ ఏడాది చివరి లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ఫైనలైజ్ అయ్యే అవకాశముందని తెలిపారు.

Details

ప్రపంచంలోనే తొలి కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్

కార్బైన్‌ల సరఫరాలో 60 శాతం భారత్ ఫోర్జ్, మిగతా 40 శాతం (1.70 లక్షల కార్బైన్‌లు) అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ PLR సిస్టమ్స్ అందించనున్నట్లు వెల్లడించారు. ప్రపంచంలోనే తొలి కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్ — అర్బెల్ టెక్నాలజీను భారత్‌కు అందించేందుకు చర్చలు కొనసాగుతున్నాయని కూడా ఆయన చెప్పారు. యుద్ధరంగంలో సైనికులు అత్యంత కచ్చితత్వం, వేగం, మార్పులపై తక్షణ ప్రతిస్పందనతో వ్యవహరించేందుకు ఇది కీలకమని పేర్కొన్నారు. ఒప్పందం కుదిరితే ఈ రైఫిల్ సిస్టమ్ ఉత్పత్తి భారత్‌లో కూడా ప్రారంభిస్తామని తెలిపారు.

Advertisement

Details

ఏమిటీ అర్బెల్ టెక్నాలజీ?

అర్బెల్ (ARBEL) టెక్నాలజీ ఆధునిక సెన్సర్లతో కూడిన పూర్తి కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్. ఇది రియల్ టైమ్ బాలిస్టిక్ కంప్యూటేషన్ లక్ష్య సముపార్జన టెక్నాలజీ ద్వారా అత్యంత కచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించడంలో సహాయం చేస్తుంది. ఇందులో ఉన్న MEMS (Micro Electro Mechanical System) అల్గారిథమ్స్ ఆయుధం లక్ష్యాన్ని తగిలే అవకాశం ఎంత ఉందో మిల్లీసెకన్లలో లెక్కిస్తాయి. మొదటి గొల్లి తర్వాత షూటర్ ట్రిగ్గర్‌ను అలాగే ఉంచితే, షూటర్ ప్రవర్తనను అంచనా వేసి తదుపరి రౌండ్లను స్వయంచాలకంగా విడుదల చేసే సామర్థ్యాన్ని ఈ టెక్నాలజీ కలిగి ఉంది. మొత్తం మీద, భారత్-ఇజ్రాయెల్ రక్షణ సహకారం మరింత బలపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Advertisement