NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / జపాన్ లో భారీ భూకంపం.. పరుగుల తీసిన జనం
    జపాన్ లో భారీ భూకంపం.. పరుగుల తీసిన జనం
    1/2
    అంతర్జాతీయం 1 నిమి చదవండి

    జపాన్ లో భారీ భూకంపం.. పరుగుల తీసిన జనం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 05, 2023
    03:17 pm
    జపాన్ లో భారీ భూకంపం.. పరుగుల తీసిన జనం
    జపాన్ లో రెండోసారి భూకంపం

    జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు జపాన్ మెటరాలజికల్ ఏజెన్సీ వెల్లడించింది. శుక్రవారం భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇంటికి బయటికి పరుగులు పెట్టారు. సెంట్రల్ జపాన్ లోని ఇషికావా ఫ్రి ఫెక్చర్ లో భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో ఈ కదలికలు ఏర్పడినట్లు ధ్రువీకరించారు. ధ్వంసమైన భవనాల నివేదికలను అధికారులు పరిశీలించడం మొదలుపెట్టారు. అయితే సునామీ ముప్పు ఏమీ లేదని అధికారులు తెలియజేశారు.

    2/2

    నెల రోజుల వ్యవధిలో జపాన్ లో రెండోసారి భూకంపం 

    సముద్ర మట్టంలో 20సెం.మీ కంటే తక్కువలో మార్పులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలిపింది. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇప్పటివరకు తెలియలేదని అధికారులు తెలిపారు. నెలరోజుల వ్యవధిలోనే జపాన్ లో భూకంపం సంభవించడం ఇది రెండోసారి. జపాన్ లో మే 1న స్వల్పంగా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.9గా నమోదైంది. జపాన్ లోని కట్సురెన్-హెబారుకు తూర్పు ఆగ్నేయంగా 79 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    భూకంపం
    జపాన్

    భూకంపం

    ఇండోనేషియాలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం; సునామీ హెచ్చరికలు  ఇండోనేషియా
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 4.3తీవ్రత నమోదు ఆఫ్ఘనిస్తాన్
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? ఆఫ్ఘనిస్తాన్
    పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం; 11మంది మృతి; ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు ఆఫ్ఘనిస్తాన్

    జపాన్

    జపాన్ సమీపంలోని జలాల్లో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా ఉత్తర కొరియా/ డీపీఆర్‌కే
    రెండు కీలక ఒప్పందాలపై జపాన్-భారత్ సంతకాలు; ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలుపై ఒప్పందం భారతదేశం
    దిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని; రక్షణ, వాణిజ్యంపై మోదీతో కీలక చర్చలు ప్రధాన మంత్రి
    2023 కవాసకి ఎలిమినేటర్ v/s బెనెల్లీ 502C ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    తదుపరి వార్తా కథనం

    అంతర్జాతీయం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    World Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023