Page Loader
అఫ్గానిస్థాన్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 4.3తీవ్రత నమోదు
అఫ్గానిస్థాన్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 4.3తీవ్రత నమోదు

అఫ్గానిస్థాన్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 4.3తీవ్రత నమోదు

వ్రాసిన వారు Stalin
Mar 29, 2023
09:34 am

ఈ వార్తాకథనం ఏంటి

అఫ్గానిస్థాన్‌లోని కాబూల్‌లో బుధవారం ఉదయం భూకంపం సభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. అఫ్గానిస్థాన్‌లో తెల్లవారుజామున 4.3 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. కాబూల్‌కు తూర్పున 85 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది.

భూకంపం

మార్చి 22న వచ్చిన భూకంపం ధాటికి 12మంది మృతి

అఫ్గానిస్థాన్‌లో మార్చి 22న 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం సంభవించగా 12 మంది మరణించారు. ఈ భూకంపం కారణంగా అఫ్గానిస్థాన్‌తో పాటు పాకిస్తాన్‌లో దాదాపు 250 మంది గాయపడ్డారు. భూకంప కేంద్రం అఫ్గానిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతం కాగా, దాని లోతు 180 కిలోమీటర్లని పాకిస్థాన్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ భూకంపం ధాటికి దిల్లీ రాజధాని ప్రాంతంతో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి.