LOADING...
Netanyahu: హమాస్‌ ఆయుధాన్ని వదిలిస్తే.. ఇజ్రాయెల్‌నే విజేత: నెతన్యాహు
హమాస్‌ ఆయుధాన్ని వదిలిస్తే.. ఇజ్రాయెల్‌నే విజేత: నెతన్యాహు

Netanyahu: హమాస్‌ ఆయుధాన్ని వదిలిస్తే.. ఇజ్రాయెల్‌నే విజేత: నెతన్యాహు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 05, 2025
10:44 am

ఈ వార్తాకథనం ఏంటి

హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం ముగింపు దిశగా, గాజాలోని బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్‌ (Israel) అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు (Netanyahu) దేశ ప్రజలకు ఓ సందేశాన్ని ఇచ్చారు. సులభమయినా, కఠినమయినా హమాస్‌ను నిరాయుధీకరించడానికి (disarm Hamas) దేశం కృషి చేస్తుందని తెలిపారు. త్వరలో ఇజ్రాయెల్‌ విజయం సాధించి, హమాస్‌ వద్ద ఉన్న ఇజ్రాయెల్‌ పౌరులు విడుదలై తిరిగి దేశానికి చేరుకుంటారని ప్రజలకు హామీ ఇచ్చారు. నెతన్యాహు చెప్పినట్లుగా, హమాస్‌ చాలా కాలంగా డిమాండ్ చేసిన విధంగా గాజా నుంచి ఇజ్రాయెల్‌ తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోదు.

Details

 ఈజిప్టులో ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య పరోక్ష చర్చలు 

అయినప్పటికీ, ట్రంప్‌ ప్రణాళికలోని తొలి దశ అమలు కోసం ఇజ్రాయెల్‌ సిద్ధమని ఆయన తెలిపారు. రెండో దశలో హమాస్‌ను దౌత్యపరంగా లేదా సైనిక శక్తితో నిరాయుధీకరిస్తామన్నారు. ట్రంప్‌ దీనిలో ఆలస్యం చేయడాన్ని అంగీకరించరని కూడా నెతన్యాహు స్పష్టం చేశారు. ఈ క్రమంలో సోమవారం ఈజిప్టులో ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య పరోక్ష చర్చలు జరగనున్నాయి. నెతన్యాహు ప్రకారం, తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ పౌరులను త్వరలో విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

Details

మరికొన్ని అంశాలపై చర్చలు జరిగే అవకాశం

ట్రంప్‌ ప్రణాళికలపై హమాస్‌ సానుకూలంగా స్పందించినది తెలిసిందే. హమాస్‌ బందీల విడుదలకు, గాజా పాలనను తాత్కాలిక ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధమని ప్రకటించింది. మరికొన్ని అంశాలపై చర్చలు జరపాలని కోరింది. దీన్ని ట్రంప్‌ స్వాగతించాడు. ట్రంప్‌ సూచన మేరకు, గాజాపై బాంబు దాడులు చేయకూడదని ఇజ్రాయెల్‌కు హెచ్చరించారు, అయినప్పటికీ ఇజ్రాయెల్‌ శనివారం మళ్లీ గాజాపై దాడులు చేసింది. తాజాగా అమెరికా అధ్యక్షుడు తిరిగి గాజాలోని బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్‌ అంగీకరించిందని, హమాస్‌ కూడా దీన్ని అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందన్నారు.