Page Loader
North Korea: అమెరికా, దక్షిణ కొరియాలపై అణు బాంబ్‌తో దాడి చేస్తాం : కిమ్ జోంగ్ ఉన్
అమెరికా, దక్షిణ కొరియాలపై అణు బాంబ్‌తో దాడి చేస్తాం : కిమ్ జోంగ్ ఉన్

North Korea: అమెరికా, దక్షిణ కొరియాలపై అణు బాంబ్‌తో దాడి చేస్తాం : కిమ్ జోంగ్ ఉన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 01, 2024
11:16 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియాతో పునరేకీకరణకు ఒప్పుకోమని, తమ జోలికి వస్తే వాషింగ్టన్, సియోల్ ను నాశనం చేయడానికి సిద్ధంగా ఉండాలని కిమ్ జోంగ్ ఉన్ సైన్యానికి పిలుపునిచ్చారు. అవసరమైతే దక్షిణ అమెరికా మొత్తం భూభాగంపై అణు బాంబ్ వేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పినట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య సంబంధాలు శత్రుదేశాల మాదిరిగా మారాయని, ముఖ్యంగా అమెరికా వైపు నుంచే ముప్పును కాచుకొని ఉండాలని ఆయన సూచించారు. ఈ విషయాన్ని ఆ దేశ జాతీయ మీడియా వెల్లడించింది.

Details

 శాంతి ప్రతిపాదనలు పంపినా తిరస్కరిస్తాం 

వాస్తవాన్ని గుర్తించి దక్షిణ కొరియాతో ఉన్న తమ సంబంధాలపై స్పష్టత ఇవ్వాల్సిన సమయం వచ్చిందని మిలటరీ కమాండర్ల మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఒకవేళ వాషింగ్టన్, సియోల్ సైనిక ఘర్షణకు ప్రయత్నిస్తే తమ వద్ద ఉన్న అణ్వాయుధాలు కూడా వాడటానికి వెనుకాడబోమని హెచ్చరించారు. ముఖ్యంగా తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అవకాశం చూస్తున్న ప్రజలతో ఎటువంటి సంబంధాలను కొనసాగించమని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికాతో ఎటువంటి ఘర్షణ జరిగినా, తట్టుకొనే విధంగా తయారీని వేగవంతం చేయాలని సూచించారు. ఇక భవిష్యతులో దక్షిణ కొరియా పాలకులు శాంతి ప్రతిపాదనలు చేసినా ఉత్తయ కొరియా తిరస్కరించడం ఖాయమన్నారు.