NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Zelensky: రష్యా-ఉక్రెయిన్‌ సమస్య పరిష్కారానికి భారత్ వేదికగా మారొచ్చు: జెలెన్‌స్కీ
    తదుపరి వార్తా కథనం
    Zelensky: రష్యా-ఉక్రెయిన్‌ సమస్య పరిష్కారానికి భారత్ వేదికగా మారొచ్చు: జెలెన్‌స్కీ
    రష్యా-ఉక్రెయిన్‌ సమస్య పరిష్కారానికి భారత్ వేదికగా మారొచ్చు: జెలెన్‌స్కీ

    Zelensky: రష్యా-ఉక్రెయిన్‌ సమస్య పరిష్కారానికి భారత్ వేదికగా మారొచ్చు: జెలెన్‌స్కీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 28, 2024
    12:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలువరించడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక శక్తి సామర్థ్యాలున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు.

    ఓ భారత మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీకి ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు ఉందని చెప్పారు.

    అలాగే, రష్యా-ఉక్రెయిన్ చర్చలు భారత్‌లో జరుగవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.

    జెలెన్‌స్కీ, మోదీ రష్యా నుంచి చవకగా ఇంధనం కొనుగోలు చేస్తున్నందున, ఈ కొనుగోళ్లను ఆపడం ద్వారా రష్యా దూకుడుకు కళ్లెం వేయగలరని అభిప్రాయపడ్డారు.

    యుద్ధం జరుగుతున్న సందర్భంలో ప్రత్యర్థితో చర్చలు జరపడం అత్యంత ముఖ్యమన్నారు.

    Details

    రెండో ప్రపంచ శాంతి సదస్సుకు సిద్ధం

    నవంబర్‌లో జరుగనున్న రెండో ప్రపంచ శాంతి సదస్సుకు ముందు తమ దేశం సిద్ధం కావాలని కోరారు.

    ఉక్రెయిన్, తొలి శాంతి శిఖరాగ్ర సమావేశాన్ని స్విట్జర్లాండ్‌లో నిర్వహించగా, ఇందులో రష్యా మినహా 92 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

    అమెరికాలో నవంబర్ 5న జరగనున్న ఎన్నికల్లో, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వస్తే రష్యాకు మరింత సైనిక సహాయం అందే అవకాశం ఉందని జెలెన్‌స్కీ ఆందోళన వ్యక్తం చేశారు.

    రష్యా ఇప్పటికే ఉక్రెయిన్‌పై తరచుగా దాడులు చేస్తోందని, అలాంటి పరిస్థితుల్లో ట్రంప్ అధికారంలోకి వస్తే వారి దాడులు మరింత తీవ్రతరమవుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

    Details

    పశ్చిమ దేశాలకు జెలెన్‌స్కీ విజ్ఞప్తి 

    జెలెన్‌స్కీ, రష్యా అత్యాధునిక ఆయుధాలతో తమపై విరుచుకుపడుతుండటంతో పశ్చిమ దేశాలకు ఆయుధాల కోసం పలు సార్లు విజ్ఞప్తి చేశారు.

    ఈ నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉక్రెయిన్‌కు ఐదు వ్యూహాత్మక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అందించడానికి అంగీకరించినట్లు ప్రకటించారు.

    అమెరికా-రష్యా సంబంధాలు యుద్ధం వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ట్రంప్, ఉక్రెయిన్‌కు సైనిక, ఆర్థిక సహాయం అందించడం తప్పుపట్టారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జెలెన్‌స్కీ
    ఉక్రెయిన్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    జెలెన్‌స్కీ

    ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ఆపే శక్తి మోదీకి ఉంది: ఆమెరికా వ్లాదిమిర్ పుతిన్
    అదనపు మానవతా సాయం కోరుతూ మోదీకి లేఖ రాసిన జెలెన్‌స్కీ  ఉక్రెయిన్
    మోదీజీ, యుద్ధాన్ని ముగించే శాంతి ప్రతిపాదనకు మద్దతు తెలపండి; జెలెన్‌స్కీ అభ్యర్థన నరేంద్ర మోదీ
    రిషి సునక్ తల్లి చేసిన 'బర్ఫీ'ని రుచి చూసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రిషి సునక్

    ఉక్రెయిన్

    'బైడెన్ భద్రతకు మేము హామీ ఇచ్చాం'; ఉక్రెయిన్ రహస్య పర్యటనపై స్పందించిన రష్యా రష్యా
    రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్‌; భారత్, చైనా దూరం ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    ఉక్రెయిన్‌పై క్షిపణులతో విరుచుపడ్డ రష్యా- ఆరుగురు పౌరులు మృతి ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    ఐసీసీ వారెంట్: పుతిన్ ఎప్పుడు అరెస్టు అవుతారు? నిపుణులు ఏం అంటున్నారు? వ్లాదిమిర్ పుతిన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025