LOADING...
India Slams Pakistan: 125 ఏళ్ల గురుద్వారా కూల్చివేత.. పాక్‌పై భారత్ తీవ్ర ఆగ్రహం
125 ఏళ్ల గురుద్వారా కూల్చివేత.. పాక్‌పై భారత్ తీవ్ర ఆగ్రహం

India Slams Pakistan: 125 ఏళ్ల గురుద్వారా కూల్చివేత.. పాక్‌పై భారత్ తీవ్ర ఆగ్రహం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 02, 2026
11:35 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో 125 ఏళ్ల చరిత్ర కలిగిన గురుద్వారాను కూల్చివేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఫరూఖాబాద్‌లో ఉన్న 'గురుద్వారా శ్రీ గురు సింగ్ సభ సాహిబ్'ను ధ్వంసం చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. సిక్కు సమాజానికి అత్యంత పవిత్రమైన ఈ ప్రార్థనా స్థలాన్ని ఉద్దేశపూర్వకంగానే లక్ష్యంగా చేసుకుని కూల్చివేశారని భారత్ ఆరోపించింది. సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా జూన్ 24 రాత్రి ఈ చారిత్రక నిర్మాణాన్ని కూల్చివేసినట్లు పాకిస్థాన్ అధికారులు కూడా ధ్రువీకరించారు.

వివరాలు 

దర్యాప్తు చేసి పునర్నిర్మాణం చేపట్టాలి: భారత్

ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. గురుద్వారా కూల్చివేత ఘటనపై పాకిస్థాన్ ప్రభుత్వం వెంటనే సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ధ్వంసమైన గురుద్వారా భాగాలను తక్షణమే పునర్నిర్మించాలని కోరారు. పాకిస్థాన్‌లో మైనారిటీల భద్రత, వారి మతపరమైన హక్కుల పరిరక్షణలో అక్కడి ప్రభుత్వం విఫలమవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీలపై, వారి ప్రార్థనా స్థలాలపై వ్యవస్థీకృత దాడులు నిరంతరంగా కొనసాగుతున్నాయని భారత్ స్పష్టం చేసింది.

వివరాలు 

పంజాబ్ ప్రభుత్వం స్పందన

ఈ కూల్చివేతకు వ్యతిరేకంగా స్థానిక సిక్కు సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. దీంతో పాకిస్థాన్ పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ స్పందించారు. పంజాబ్ మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి రమేష్ సింగ్ అరోరా ఉన్నతాధికారులతో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మైనారిటీల హక్కులు, వారి మతపరమైన ఆస్తుల రక్షణకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన ప్రకటించారు. వివాదాస్పద భూమి యాజమాన్య హక్కులపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించడమే కాకుండా, గురుద్వారా పునరుద్ధరణ పనులను వెంటనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

వివరాలు 

పునరుద్ధరణపై స్థానికుల అభ్యంతరాలు

అయితే ప్రభుత్వ పునరుద్ధరణ నిర్ణయంపై స్థానిక వ్యాపారులు, నివాసితులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత 80 ఏళ్లుగా గురుద్వారా ప్రాంగణం వినియోగంలో లేకపోవడంతో ఆ ప్రాంతంలో అనేక కుటుంబాలు స్థిరపడి దుకాణాలు ఏర్పాటు చేసుకున్నాయని వారు చెబుతున్నారు. ఇప్పుడు పునరుద్ధరణ చర్యలు చేపడితే అనేక కుటుంబాలు నివాసం, ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ప్రభావిత కుటుంబాలకు ప్రత్యామ్నాయ నివాసంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

125 ఏళ్ల గురుద్వారా ధ్వంసం.. పాక్‌పై భారత్ తీవ్ర ఆగ్రహం

Advertisement