Page Loader
కరోనా విజృంభణ వేళ.. భారత జెనరిక్ ఔషధాల కోసం ఎగబడుతున్న చైనీయులు
చైనా బ్లాక్ మార్కెట్‌లో భారతీయ కరోనా జనరిక్ ఔషధాలు

కరోనా విజృంభణ వేళ.. భారత జెనరిక్ ఔషధాల కోసం ఎగబడుతున్న చైనీయులు

వ్రాసిన వారు Stalin
Dec 29, 2022
01:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనాలో కరోనా వీరవిహారం చేస్తోంది. ఒమిక్రాన్ బీఎఫ్.7తో ఉక్కిరిబిక్కరి అవుతున్న బీజింగ్‌లో ఇప్పుడు.. ఔషధార కొరత ఏర్పడింది. మహమ్మారి నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చైనీయులు భారతీయ ఔషధాలను ఆశ్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో అవి లభ్యం కాకపోవడంతో.. బ్లాక్ మార్కెట్ కొని మరీ.. వినియోగిస్తున్నారు. కరోనా విజృంభణతో దేశంలో ఔషధాల వినియోగం భారీగా పెరిగింది. ఫైజర్స్ పాక్స్‌లోవిడ్ తోపాటు చైనీస్ సంస్థ జెన్యూన్ బయోటెక్‌కు చెందిన అజ్వుడిన్ మందులను మాత్రమే కరోనా యాంటీవైరల్‌ డ్రగ్‌గా వినియోగించేందుకు ఆ‌దేశం అనుమతిచ్చింది. ప్రస్తుత డిమాండ్‌కు తగ్గట్లు.. ఆ మందుల సరఫరా లేకపోవడంతో.. అక్కడి ప్రజలు బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నారు. ఆ మందుల్లో భారత్‌కు చెందిన జనరిక్ మెడిసిన్స్ ఎక్కువగా ఉండటం గమనార్హం.

చైనా

తక్కువ ధరకు భారతీయ ఔషధాలు

భారత్ చెందిన నాలుగు రకాల జెనరిక్ యాంటీ కోవిడ్ ఔషధాలు చైనా బ్లాక్ మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. అందులో ప్రిమోవిర్, పాక్సిస్టా, మోల్నునాట్, మోల్నాట్రిస్ మందులు ఉన్నాయి. కోవిడ్ నుంచి రక్షణ కల్పిస్తుండటంతోపాటు.. తక్కువ ధరకు లభిస్తుండటంతో చైనీయులు ఎక్కువ సంఖ్యలో ఈ భారతీయ ఔషధాలను కోనుగోలు చేస్తున్నారు. చైనాకు చెందిన 'పాక్స్‌లోవిడ్' ఒక్కో‌బాక్స్‌కు 2,980 యువాన్‌లు ఖర్చవుతుండగా.. భారత్‌కు చెందిన జనరిక్ ఔషధాలు ఒక్కో బాక్స్ 530 నుంచి 1,600 యువాన్ల మధ్య లభ్యమవుతోంది. వాస్తవానికి భారతీయ జనరిక్ మందుల విక్రయానికి చైనాలో అనుమతి లేదు. 'వీబో' లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో మేసేజ్‌లను షేర్ చేసుకుంటూ.. భారతీయ జనరిక్ మందులను అక్కడి ప్రజలు బ్లాక్‌లో పొందుతున్నట్లు సౌత్‌చైనా మార్నింగ్ పోస్ట్ చెబుతోంది.