LOADING...
Iran: అమెరికా బెదిరింపుల మధ్య నిరసనకారులను అణిచివేయడానికి ఇరాన్ 'ఇరాక్‌ మిలీషియా'?
అమెరికా బెదిరింపుల మధ్య నిరసనకారులను అణిచివేయడానికి ఇరాన్ 'ఇరాక్‌ మిలీషియా'?

Iran: అమెరికా బెదిరింపుల మధ్య నిరసనకారులను అణిచివేయడానికి ఇరాన్ 'ఇరాక్‌ మిలీషియా'?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2026
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో ఇప్పటివరకు రెండువేల మందికిపైగా మృతి చెందగా, వేలాది మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. అంతర్జాతీయంగా హెచ్చరికలు వస్తున్నప్పటికీ, నిరసనలపై కఠిన చర్యలు తప్పవని సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమెనీ స్పష్టంగా చెబుతున్నారు. ఈ క్రమంలో ఆందోళనలను అణచివేయడానికి ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, ఇందుకోసం విదేశీ మిలీషియా సాయాన్ని కూడా ఆశ్రయిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. నిరసనకారుల మరణాల సంఖ్య పెరుగుతున్న వేళ ఈ అంశం తీవ్ర చర్చకు దారి తీసింది.

వివరాలు 

 800 మంది సరిహద్దు దాటి ఇరాన్‌లోకి ప్రవేశం 

ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నిరసనలను కట్టడి చేయడానికి ఇరాక్‌కు చెందిన మిలీషియా బలగాలను వినియోగిస్తున్నట్లు సమాచారం. వందల సంఖ్యలో సాయుధులను సమీకరించి టెహ్రాన్‌కు తరలిస్తున్నట్లు 'ఇరాన్ ఇంటర్నేషనల్' పేర్కొంది. ఇప్పటికే సుమారు 800 మంది సరిహద్దు దాటి ఇరాన్‌లోకి ప్రవేశించినట్లు తెలిపింది. వీరంతా కటైబ్ హెజ్‌బొల్లా, హరాకత్ అల్-నుజాబా, లివా సయ్యిద్ అల్ షుహాదా వంటి సంస్థలకు చెందినవారిగా అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇరాక్ ప్రభుత్వం అధికారికంగా స్పందించకపోయినా, దీనిపై వారికి పూర్తి అవగాహన ఉందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి.

వివరాలు 

మతపరమైన పర్యటన పేరుతో.. 

ఈ సాయుధ బలగాలు మూడు వేర్వేరు మార్గాల ద్వారా ఇరాన్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. పవిత్ర నగరం మషాద్‌లోని ఇమామ్ రెజా దర్శనం పేరుతో దేశంలోకి అడుగుపెట్టినట్లు సమాచారం. మొదట వీరిని ఒక ప్రాంతానికి తరలించి, అక్కడి నుంచి షాలంచా, జదీదత్ అరర్, ఖోస్రావి సరిహద్దు క్రాసింగ్‌ల గుండా ఇరాన్‌లోకి పంపినట్లు తెలుస్తోంది. నిరసనల్లో పాల్గొంటున్నవారు వీరు ఇరాకీ యాసలో అరబిక్ మాట్లాడుతున్నారని చెబుతుండటం ఈ కథనాలకు మరింత బలం ఇస్తోంది.

Advertisement

వివరాలు 

మతపరమైన పర్యటన పేరుతో.. 

విదేశీ మిలీషియాను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ఇరాన్‌పై ఇంతకుముందు కూడా వచ్చాయి. మూడు సంవత్సరాల క్రితం మహిళల ఉద్యమం సమయంలోనూ మషాద్‌తో పాటు ఇతర నగరాల్లో నిరసనలను అణచివేయడానికి విదేశీ మిలీషియాను మోహరించారనే వార్తలు వెలువడ్డాయి. సిరియా అంతర్యుద్ధంలో బషర్ అల్ అసద్‌కు విదేశీ మిలీషియా మద్దతు ఇచ్చిన తరహాలోనే, ప్రస్తుతం ఇరాన్‌లోనూ పరిస్థితులు ఉన్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement