LOADING...
Iran protests: ఇరాన్ నిరసనలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'సేవ్ ఎర్ఫాన్ సోల్తానీ' హ్యాష్‌ట్యాగ్ 
Iran: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'సేవ్ ఎర్ఫాన్ సోల్తానీ' హ్యాష్‌ట్యాగ్

Iran protests: ఇరాన్ నిరసనలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'సేవ్ ఎర్ఫాన్ సోల్తానీ' హ్యాష్‌ట్యాగ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 14, 2026
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌లో 2026 ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో తొలి నిరసనకారుడికి ఉరిశిక్ష విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వార్తలు రావడంతో సోషల్ మీడియాలో "Save Erfan Soltani" హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మానవ హక్కుల సంస్థల ప్రకారం 26 ఏళ్ల ఎర్ఫాన్ సోల్తానీకి బుధవారం ఉరిశిక్ష అమలు చేసే అవకాశం ఉందని చెబుతున్నాయి. రెండు వారాలకుపైగా దేశాన్ని కుదిపేస్తున్న నిరసనల్లో పాల్గొన్నాడన్న కారణంతో అతడిని ఇంటి నుంచి అరెస్ట్ చేశారు. "స్వేచ్ఛ కోరడమే అతడి నేరం" అంటూ ఎర్ఫాన్ సోల్తానీకి ఉరిశిక్ష విధించనున్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. సోషల్ మీడియాలో సాధారణ ప్రజలే కాదు,ప్రముఖులు కూడా అతడిని కాపాడాలని పిలుపునిస్తున్నారు.

వివరాలు 

దేవుడిపై యుద్ధం

హాలీవుడ్ నటుడు, Friends సీరీస్‌ నటుడు డేవిడ్ శ్విమ్మర్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో Save Erfan Soltani హ్యాష్‌ట్యాగ్‌ను రీపోస్ట్ చేశారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, అవినీతి వంటి కారణాలతో ఇరాన్‌లో ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. అయితే దేశ నాయకత్వం ఈ నిరసనలను "దేవుడిపై యుద్ధం"గా పేర్కొంటూ కఠినంగా అణిచివేస్తోంది. ఇప్పటివరకు 2,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు, 10,000 మందికిపైగా అరెస్టయినట్లు నివేదికలు చెబుతున్నాయి.

వివరాలు 

నాలుగు రోజులలో ఎర్ఫాన్'కి ఉరిశిక్ష

ఎర్ఫాన్ సోల్తానీ అరెస్ట్ అయిన తర్వాత కొన్ని రోజులపాటు అతడి ఆచూకీ కుటుంబానికి తెలియదని హ్యూమన్ రైట్స్ సంస్థ 'హెంగావ్' సభ్యురాలు అరినా మొరాది తెలిపారు. నాలుగు రోజులలో అతడికి ఉరిశిక్ష విధిస్తున్నట్లు సమాచారం ఇచ్చారని కుటుంబ సభ్యులు వాపోయారు. ఎర్ఫాన్ రాజకీయ కార్యకర్త కాదని, దేశ పరిస్థితులపై నిరసన తెలిపిన యువతలో ఒకడని వారు చెబుతున్నారు. అతడికి న్యాయవాది సహాయం వంటి మౌలిక హక్కులు కూడా ఇవ్వడం లేదని ఆ సంస్థ ఆరోపించింది. కస్టడీలో అతడిపై హింస జరుగుతుందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. ఉరిశిక్షకు ముందు కేవలం 10 నిమిషాల పాటు మాత్రమే కుటుంబాన్ని కలవడానికి అనుమతి ఇస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

వివరాలు 

ఎర్ఫాన్ సోల్తానీ ఉరిశిక్షపై డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఉరిశిక్షను అమలు చేయొద్దని ఇరాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలా చేస్తే "తీవ్ర చర్యలు" తీసుకుంటామని ఆయన చెప్పారు. ఇరాన్‌పై తన లక్ష్యం ఏమిటని ఓ రిపోర్టర్ అడిగితే, "నిరసనలు ఒక విషయం. కానీ వేల మందిని చంపడం, ఇప్పుడు ఉరిశిక్షలు అంటున్నారు - అలా చేస్తే వాళ్లకు మంచిది కాదు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు సోషల్ మీడియాలో ఓ రహస్యమైన పోస్టులో "సహాయం వస్తోంది" అంటూ ఇరానీయులకు సందేశం ఇచ్చారు. అయితే ఎలాంటి సహాయం అన్నది మాత్రం స్పష్టం చేయలేదు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్ 

Advertisement