LOADING...
Hantavirus Alert: హంటావైరస్ ముప్పు పెరుగుతోందా?.. లక్షణాలు, జాగ్రత్తలు తెలుసుకోండి!
హంటావైరస్ ముప్పు పెరుగుతోందా?.. లక్షణాలు, జాగ్రత్తలు తెలుసుకోండి!

Hantavirus Alert: హంటావైరస్ ముప్పు పెరుగుతోందా?.. లక్షణాలు, జాగ్రత్తలు తెలుసుకోండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 05, 2026
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇప్పటికే అనేక రకాల వైరస్‌లు ప్రపంచాన్ని కుదిపేశాయి. కరోనా మహమ్మారి, దాని వేరియంట్ల భయం పూర్తిగా తగ్గకముందే మరోసారి వైరస్‌పై చర్చలు మొదలయ్యాయి. తాజాగా ఒక క్రూయిజ్ షిప్‌లో ముగ్గురు మరణించిన ఘటనతో హంటావైరస్ పై ఆందోళనలు పెరిగాయి. ఎలుకల ద్వారా వ్యాపించే ఈ వైరస్ ప్రారంభంలో సాధారణ ఫ్లూ లక్షణాలతో కనిపించినప్పటికీ, తీవ్రమైన దశలో ప్రాణాపాయం కలిగించే ప్రమాదం ఉంది. అయితే ప్రస్తుతానికి సాధారణ ప్రజలకు పెద్ద ప్రమాదం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టం చేసింది.వ

వివరాలు

హంటా వైరస్ ఎలా వ్యాపిస్తుంది?

హంటా వైరస్ ప్రధానంగా ఎలుకలు, వాటి మూత్రం, మలం లేదా లాలాజలం ద్వారా మనుషులకు సంక్రమిస్తుంది. ఈ పదార్థాలు ఎండిపోయి గాలిలో కలిసినప్పుడు వాటి ద్వారా వచ్చే సూక్ష్మ కణాలను శ్వాసలోకి తీసుకోవడం వల్ల కూడా వైరస్ శరీరంలోకి చేరుతుంది. అడవులు, పాత భవనాలు, పొలాల్లో పనిచేసే వారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

వివరాలు

లక్షణాలు ఏమిటి?

ప్రారంభ దశలో ఇది సాధారణ ఫ్లూ లాగానే ఉంటుంది. జ్వరం, శరీర నొప్పులు, తలనొప్పి, వికారం, స్వల్ప దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ పరిస్థితి విషమిస్తే ఊపిరితిత్తులు, మూత్రపిండాలపై ప్రభావం చూపి శ్వాసలో ఇబ్బందులు తలెత్తుతాయి. కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగా మారుతుంది. సాధారణ ఫ్లూతో పోలిస్తే హంటా వైరస్ ప్రమాదకరమైంది. కొన్ని ప్రాంతాల్లో మరణాల రేటు 14% వరకు ఉండగా, అమెరికా ఖండంలో ఇది 40% వరకు నమోదవుతోంది. ఫ్లూతో పోలిస్తే ఇది తీవ్రమైన అవయవ నష్టానికి దారితీస్తుంది.

Advertisement

వివరాలు

ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి

ఈ వైరస్ కేసులు ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా చైనా, రష్యా, దక్షిణ కొరియా దేశాల్లో ప్రతి ఏడాది వేల సంఖ్యలో కేసులు కనిపిస్తున్నాయి. అమెరికా, ఫిన్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కూడా ఈ ఇన్ఫెక్షన్ ఉంది. సాధారణంగా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. అయితే ఆండెస్ అనే ప్రత్యేక రకం మాత్రం సన్నిహిత సంబంధాల ద్వారా సంక్రమించే అవకాశం ఉంది. ఇటీవల క్రూయిజ్ షిప్ ఘటనలో వైరస్ ఎలా వ్యాపించిందన్నది ఇంకా స్పష్టతకు రాలేదు.

Advertisement

వివరాలు

చికిత్స ఉందా?

హంటా వైరస్‌కు ప్రత్యేకమైన ఔషధం లేదు. లక్షణాల ఆధారంగా మాత్రమే వైద్యులు చికిత్స అందిస్తారు. తీవ్రమైన కేసుల్లో ఐసీయూలో ఆక్సిజన్, ఇతర సహాయక చికిత్సలు అవసరమవుతాయి. తొందరగా గుర్తించి చికిత్స ప్రారంభిస్తే కోలుకునే అవకాశాలు పెరుగుతాయి.

వివరాలు

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎలుకలు ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి ఇళ్లను శుభ్రంగా ఉంచాలి ఎలుకల మలమూత్రాలతో సంబంధం ఉన్న ప్రాంతాలను శుభ్రం చేసే సమయంలో మాస్క్, గ్లౌజులు ధరించాలి మూసి ఉన్న ప్రదేశాల్లో అనారోగ్య లక్షణాలు ఉన్నవారిని వెంటనే వేరుచేయాలి మొత్తానికి, హంటా వైరస్ మొదట ఫ్లూ లాగానే కనిపించినా, అది తీవ్రమైన ప్రభావం చూపే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పెద్దగా భయపడాల్సిన అవసరం లేకపోయినా, అప్రమత్తంగా ఉండటం అత్యంత కీలకం.

Advertisement