Israel: ఇజ్రాయెల్-హమాస్ ఒప్పందం.. 737 మంది పాలస్తీనియన్లు రేపు విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం సాధ్యమవడంతో బందీల విడుదల కోసం మార్గం సుగమమైంది. ఆదివారం నుంచి ఈ ప్రక్రియ మొదలుకానుంది.
మొదటి విడుతలో భాగంగా ఇజ్రాయెల్ 737 మంది పాలస్తీనియా పౌరులను విడిచిపెట్టాలని ప్రకటించింది. ఈ బందీలు దేశంలోని వివిధ జైళ్లలో ఉన్న ఖైదీలుగా గుర్తించారు.
వారిని ఆదివారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తామని, ఇందులో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని ఇజ్రాయెల్ న్యాయ శాఖ పేర్కొంది.
ముందుగా 95 మందిని విడుదల చేయనున్నట్టు ఇజ్రాయెల్ జాబితాను విడుదల చేసింది. ఇందులో ఎక్కువ భాగం మహిళలే కావడం విశేషం.
Details
ఒప్పందానికి సెక్యూరిటీ క్యాబినెట్ అంగీకారం
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం శనివారం ఉదయం ఇజ్రాయెల్ క్యాబినెట్ ఆమోదం పొందింది. ఈ ఒప్పందంతో 737 మంది బందీలను విడచేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ శుక్రవారం అంగీకారం తెలిపింది. గాజా కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం హమాస్ తమ వద్ద ఉన్న ఇజ్రాయెలీలను ఇజ్రాయెల్‌కు అప్పగిస్తుంది.
అదే విధంగా ఇజ్రాయెల్ తన జైళ్లలో ఉన్న పాలస్తీనీయులను విడుదల చేయనుంది.
బందీల తొలి బృందాన్ని ఆదివారం విడుదల చేయడం ద్వారా ఈ ఒప్పందం అమల్లోకి వస్తుంది.