Israel : కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ బందీల మార్పిడి.. కాల్పుల విరమణ గడువు మరోసారి పొడిగింపు
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్-హమాస్ పక్షాల మధ్య కాల్పుల విరమణ గడువు ముగిసే కొద్ది నిమిషాల ముందు మరోసారి గడువు పొడిగింపు అయ్యింది.
ఈ మేరకు ఇజ్రాయెల్-హమాస్ బందీల మార్పిడి ఒప్పందం పునరుద్ధరణ జరిగింది. ఈ క్రమంలోనే కాల్పుల విరమణ ఒప్పందం మరో 2 రోజుల పాటు కొనసాగనుంది. వచ్చే శుక్రవారం వరకు తాజా ఒప్పందం గడువు తీరనుంది.
ముందుగా కుదుర్చుకున్న నాలుగు రోజుల ఒప్పందం సోమవారంతో ముగిసింది. దీంతో ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో మరో 2 రోజుల పాటు కాల్పుల విరమణకు పొడిగింపు కోసం ఇరు వర్గాలు అంగీకరించాయి.
తాజా ఒప్పందం ప్రకారం, హమాస్ ప్రతి రోజూ 10 మంది ఇజ్రాయెల్ బందీలను విడిచి పెట్టాల్సి ఉంటుంది.
details
ఏడో రోజుకు చేరిన ఇజ్రాయెల్-హమాస్ సంధి
మరోవైపు ప్రతి బందీకి బదులుగా ముగ్గురు పాలస్తీనా వాసులను ఇజ్రాయెల్ వదలిపెట్టాల్సి ఉంటుంది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరో 2 రోజుల పాటు కొనసాగనుంది. ఖతార్, పశ్చిమ దేశాల మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఇటీవలే తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం గత శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది.
ఆదివారం నాటికి 58 మంది బందీలను హమాస్, 114 మందిని ఇజ్రాయెల్ విడుదల చేశాయి. నాలుగో విడత బందీలు విడుదల కావాల్సి ఉంది.
మరోవైపు ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న మరింత మంది పాలస్తీనీయులను విడిపించుకునేందుకు కాల్పుల విరమణ పొడిగింపును కోరుతున్నట్లు హమాస్ అంతకుముందే వెల్లడించింది. తాజా పొడిగింపుతో సంధి ఏడో రోజుకు చేరడం విశేషం.