Israel Hamas War: గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 26మంది మృతి
దక్షిణ గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం బాంబులతో విరుచుకుపడుతోంది. ఖాన్ యూనిస్ ప్రాంతంలోని నివాస భవనంపై జరిపిన దాడిలో 26 మంది మరణించినట్లు స్థానిక ఆసుపత్రి డైరెక్టర్ తెలిపారు. మరో 23మంది గాయపడినట్లు వెల్లడించారు. చనిపోయిన వారిలో ఎక్కువమంది చిన్నారులు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే, ఇజ్రాయెల్ సైన్యం ధాటికి ఉత్తర గాజాలోని బెయిట్ లాహియాలోని ఇండోనేషియా ఆసుపత్రి చుట్టుపక్కల ప్రాంతం కూడా దెబ్బతిన్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు నివేదిస్తున్నాయి. అయితే గాజాలోని పరిస్థితిపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. కాల్పుల విరమణకు సహకరించాలని ఇజ్రాయెల ను ఐరాస కోరింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో 4,700మంది పిల్లలు, 3,000మంది మహిళలు సహా 12,000మంది మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.