Israel: హమాస్ ను ఉగ్రవాద సంస్థగా భారత్ గుర్తించాలని ఇజ్రాయెల్ వినతి..
ఈ వార్తాకథనం ఏంటి
హమాస్‌ను తీవ్రవాద సంస్థగా ప్రకటించాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా భారత్‌ను కోరింది. హమాస్‌కు, లష్కరే తోయిబా (LeT)కు మధ్య సంబంధాలు పెరుగుతున్నాయని ఆ దేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే లష్కరే తోయిబాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన భారత్, ఇదే తరహాలో హమాస్‌పైనా కఠిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. న్యూఢిల్లీ తీసుకునే నిర్ణయం దక్షిణాసియా ప్రాంత రాజకీయాలపై కీలక ప్రభావం చూపుతుందని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ అధికారులు పేర్కొన్నారు. హమాస్, లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థల నిర్మాణం, నెట్‌వర్క్‌లు, వాటి పరస్పర సంబంధాలపై భారత ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉందని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ఈ తరహా గ్రూపులను ఉగ్రవాద సంస్థలుగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అభిప్రాయపడ్డారు.
వివరాలు
హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా,బ్రిటన్,కెనడాతో పాటు పలు దేశాలు
అలాగే ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ (IRGC), హమాస్, హిజ్బుల్లా వంటి సంస్థలు నేరుగా దాడులు చేయకుండా, ప్రపంచవ్యాప్త నేరగాళ్ల నెట్‌వర్క్‌లను ఉపయోగించి తమ పనులు సాగిస్తున్నాయని టెల్ అవివ్ ఆరోపించింది. డ్రగ్ మాఫియా, మానవ అక్రమ రవాణాదారుల వంటి గ్యాంగ్‌ల సహాయంతో దాడుల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. 1987లో ఏర్పడిన హమాస్‌ను అమెరికా, బ్రిటన్, కెనడాతో పాటు పలు దేశాలు ఇప్పటికే ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించినప్పటికీ, తమ చట్టాల ప్రకారం ఇప్పటి వరకు హమాస్‌ను ఉగ్రసంస్థగా గుర్తించలేదు.
వివరాలు
ఈ దేశాలు భారత్ వైఖరిని గౌరవించే అవకాశం
అయితే న్యూఢిల్లీ ఈ నిర్ణయం తీసుకుంటే, అది అంతర్జాతీయంగా గట్టి సందేశంగా నిలుస్తుందని ఇజ్రాయెల్ తెలిపింది. ముఖ్యంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, మాల్దీవులు వంటి దేశాలు భారత్ వైఖరిని గౌరవించే అవకాశముందని పేర్కొంది. ఇది కేవలం ఆస్తులను ఫ్రీజ్ చేయడం లేదా ప్రయాణ నిషేధాలకు మాత్రమే పరిమితం కాకుండా, ఉగ్రవాదంపై భారత్ స్పష్టమైన వైఖరిని ప్రపంచానికి తెలియజేసే కీలక చర్యగా ఉంటుందని టెల్ అవివ్ స్పష్టం చేసింది.