NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / జపాన్‌: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ 
    జపాన్‌: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ 
    అంతర్జాతీయం

    జపాన్‌: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Naveen Stalin
    May 20, 2023 | 09:09 am 1 నిమి చదవండి
    జపాన్‌: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ 
    జపాన్‌: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

    జీ7 సదస్సులో పాల్గొనేందుకు ఫ్యూమియో కిషిడా ఆహ్వానం మేరకు జపాన్‌కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం నరేంద్ర మోదీ, మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హిరోషిమాలో ప్రధాని మోదీ విలేకరులతో మాట్లాడుతూ.. నేటికీ హిరోషిమా అనే పదం వింటేనే ప్రపంచం భయపడుతోందని అన్నారు. జీ7 సదస్సు కోసం జపాన్‌లో పర్యటించిన సందర్భంగా మహాత్ముడి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం తనకు లభించిందన్నారు. హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహం అహింస ఆలోచనను ముందుకు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను జపాన్ ప్రధానికి బహుమతిగా ఇచ్చిన బోధి వృక్షాన్ని హిరోషిమాలో నాటారని తెలుసుకున్నాక తాను చాలా సంతోషించినట్లు చెప్పారు.

    మహాత్ముడికి నివాళులర్పిస్తున్న ప్రధాని మోదీ

    PM @narendramodi unveils a bust of Mahatma Gandhi in Hiroshima, Japan. pic.twitter.com/RmZobqj9d2

    — PMO India (@PMOIndia) May 20, 2023

    జపాన్ ప్రధానితో నరేంద్ర మోదీ భేటీ; ద్వైపాక్షిక అంశాలపై చర్చ 

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హిరోషిమాలో జపాన్ పీఎంతో ఫ్యూమియో కిషిదాతో సమావేశమయ్యారు. వాణిజ్యం, ఆర్థిక, సంస్కృతితో సహా వివిధ రంగాలలో భారతదేశం-జపాన్ స్నేహాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించారు. జీ7 శిఖరాగ్ర సమావేశానికి భారతదేశాన్ని ఆహ్వానించినందుకు మోదీ జపా‌న్ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. బోధి వృక్షం పెరుగుదలతో పాటు భారతదేశం-జపాన్ సంబంధాలు పెరుగుతాయని తాను నమ్ముతున్నట్లు మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఇక్కడి ప్రవాస భారతీయులతో హిరోషిమాలోని ఒక హోటల్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రవాసులు "భారత్ మాతా కీ జై", "వందేమాతరం" అంటూ, ప్రధాని మోదీని అభినందిస్తూ నినాదాలు కూడా చేశారు.

    జపాన్-భారత్ ద్వైపాక్షిక భేటీ

    PM @narendramodi met PM @kishida230 in Hiroshima. Both leaders discussed ways to enhance India-Japan friendship across different sectors including trade, economy and culture. pic.twitter.com/FaYWYtm0Tl

    — PMO India (@PMOIndia) May 19, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    జపాన్
    భారతదేశం
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    జపాన్

    జీ7 సదస్సు కోసం నేడు జపాన్‌కు మోదీ; ప్రధాని ఎజెండాలోని అంశాలు ఇవే  నరేంద్ర మోదీ
    సిడ్నీలో క్వాడ్ సమ్మిట్‌ను రద్దు; హిరోషిమాలో తదుపరి చర్చలు  ఆస్ట్రేలియా
    జపాన్ లో భారీ భూకంపం.. పరుగుల తీసిన జనం భూకంపం
    జపాన్ సమీపంలోని జలాల్లో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా ఉత్తర కొరియా/ డీపీఆర్‌కే

    భారతదేశం

    ఎస్‌అండ్‌పీ: 2023లో భారత వృద్ధి రేటు 6శాతం; బీబీబీ రేటింగ్ వృద్ధి రేటు
    వడగాలుల తీవ్రతకు మానవ తప్పిదాలే కారణమంటున్న శాస్త్రవేత్తలు  వాతావరణ మార్పులు
    భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా విమర్శలను తిరస్కరించిన కేంద్రం  అమెరికా
    డెంగ్యూ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో రెండు కంపెనీలు: ఐసీఎంఆర్ డీజీ టీకా

    నరేంద్ర మోదీ

    మోదీ కంటే ముందు రాహుల్ అమెరికా పర్యటన; 10రోజులు అక్కడే  రాహుల్ గాంధీ
    ఈ నెలలోనే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్న ప్రధాని మోదీ ప్రధాన మంత్రి
    గుజరాత్‌లో రూ.4400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభించిన ప్రధాని మోదీ  గుజరాత్
    రాజస్థాన్‌లో రూ.5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ; ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు  ప్రధాన మంత్రి

    ప్రధాన మంత్రి

    విద్వేషపూరిత ప్రసంగం, జమాన్ పార్క్ హింస కేసుల్లో ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ పాకిస్థాన్
    కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారు; ఈ నెలఖరులోనే!  నరేంద్ర మోదీ
    మోదీ జీ, మీ మాట కోసమే న్యాయం వేచి చేస్తోంది: ప్రియాంక గాంధీ  ప్రియాంక గాంధీ
    Mann ki Baat 100th Episode: ప్రజలతో కనెక్ట్ అవడానికి 'మన్ కీ బాత్' నాకు మార్గాన్ని చూపింది: ప్రధాని మోదీ  మన్ కీ బాత్

    తాజా వార్తలు

    Explainer: సిద్ధరామయ్య చరిత్ర సృష్టించబోతున్నారా? కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పని చేసింది ఎవరు? కర్ణాటక
    రూ.2వేల నోటు చలామణిని ఉపసంహరించుకున్న ఆర్‌బీఐ; సెప్టెంబర్ 30లో మార్చుకోవాలని ప్రజలకు సూచన ఆర్ బి ఐ
     'ఎన్టీఆర్ 30' టైటిల్‌ 'దేవర'; ఫస్ట్‌ లుక్‌లో పూనకాలు తెప్పిస్తున్న ఎన్టీఆర్  జూనియర్ ఎన్టీఆర్
    జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగంపై శాస్త్రీయ సర్వేకు బ్రేక్ వేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    న్యాయ శాఖను కోల్పోవడంపై కిరెణ్ రిజిజు ఆసక్తికర కామెంట్స్  కిరెణ్ రిజిజు
    'హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలకు ఆధారల్లేవు'; అదానీ గ్రూప్‌కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్  అదానీ గ్రూప్
    మరోసారి సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి గైర్హాజరు; తల్లి అనారోగ్యమే కారణం సీబీఐ
    దేశంలో కొత్తగా 865మందికి కరోనా; యాక్టివ్ కేసులు 9,092 కరోనా కొత్త కేసులు
    తదుపరి వార్తా కథనం

    అంతర్జాతీయం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    World Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023