Putin-Netanyahu: ఇరాన్ ఘర్షణలపై రష్యా-ఇజ్రాయెల్ నేతల కీలక ఫోన్ కాల్
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఫోన్ కాల్‌లో పరిస్థితులపై చర్చించారు. అంతర్జాతీయ మీడియా వర్గాల సమాచారం ప్రకారం ఇరాన్‌లోని సంఘర్షణ, మధ్యప్రాచ్యంలో పరిస్థితులపై ప్రత్యేకంగా మాట్లాడారు. అవసరమైతే ఇరాన్‌తో మధ్యవర్తిత్వానికి పుతిన్ సాయం అందిస్తారని నెతన్యాహుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాక, ఇరాన్‌లో శాంతి, భద్రతలను పునర్నిర్మించడానికి కావలసిన దౌత్య ప్రయత్నాలు కూడా పుతిన్ చేపడతారని తెలిపారు.
Details
కొన్నివారాలుగా పెద్దఎత్తున్న ఆందోళన
ఇక ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం కారణంగా గత కొన్ని వారాలుగా నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతూ వస్తున్నారు. వీరి పై భద్రతా బలగాలు చేపట్టిన చర్యల్లో ఘర్షణలు ఏర్పడడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. ఈ సంఘర్షణల్లో వేలాది మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం దాదాపు 3,000 మందికి పైగా ఆందోళనకారులు మరణించి ఉండొచ్చని అంచనా వేశారు.