America: "ఇప్పుడే ఇరాన్‌ను వదిలేయండి": ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో యూఎస్ అలర్ట్..
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ వ్యాప్తంగా సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ వ్యతిరేకంగా నిరసనలు ఆందోళన తీవ్రం అవుతున్నాయి. వందలాది మందిని అక్కడి పాలకులు చంపుతున్నప్పటికీ, ప్రజలు ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు. ఈ పరిస్థితిని అణచివేయడానికి మత నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకదాని ఫలితంగా, అమెరికా ఇరాన్ సమస్యపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇప్పటికే, ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఇరాన్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తమవ్వవచ్చనే భయంతో, యూఎస్ రాయబార కార్యాలయం అక్కడ ఉన్న తన పౌరులకు వెంటనే దేశాన్ని విడిచి వెళ్లమని హెచ్చరిక జారీ చేసింది.
వివరాలు
డెల్టా ఫోర్స్, ఇరాన్ సమీపంలోని అమెరికన్ బేస్‌లలో సిద్ధం
యూఎస్ పాస్‌పోర్టు కలిగిన వారు,లేదా అమెరికాతో సంబంధాలు ఉన్నవారు,ఇరాన్ అధికారులు అరెస్ట్ చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అందువలన, అమెరికా ఎంబసీ రెండు పౌరసత్వం కలిగిన వ్యక్తులు కూడా ఇరాన్‌లో తన పౌరులుగా పరిగణింపబడతారని,వీరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ హెచ్చరికలో,ఇరాన్ పాస్‌పోర్ట్‌తోనే దేశాన్ని వదిలి వెళ్లమని సూచన కూడా ఉంది. ఇక మరోవైపు,యూఎస్ సెక్యూరిటీ అలర్ట్ జారీ చేసిన విషయం,ట్రంప్ సైనిక దాడికి సిద్ధమవుతున్నాడా? అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇరాన్‌లో నిరసనకారుల్ని అణిచివేస్తే, తీవ్ర ప్రతిక్రియలు రావచ్చని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇటీవల, వెనిజులాలో దాడి చేసి నికోలస్ మదురో అరెస్ట్‌లో పాలుపంచుకున్న డెల్టా ఫోర్స్, ఇరాన్ సమీపంలోని అమెరికన్ బేస్‌లలో సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.