Loading...
Mass shootings: అమెరికాలో కాల్పుల ఘటనలు..ఐదుగురు మృతి, 36 మందికి గాయాలు
అమెరికాలో కాల్పుల ఘటనలు..ఐదుగురు మృతి, 36 మందికి గాయాలు

Mass shootings: అమెరికాలో కాల్పుల ఘటనలు..ఐదుగురు మృతి, 36 మందికి గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 02, 2026
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో హాలోవీన్‌ వేడుకల సందర్భంగా పలు ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 36 మంది గాయపడ్డారు. టెక్సస్‌లోని డాలస్‌లో మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో నలుగురు చనిపోగా, 15 మంది వరకు గాయపడ్డారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 12.20 గంటలకు ఎల్మ్‌ స్ట్రీట్‌లో, 1.05 గంటలకు మెయిన్‌ స్ట్రీట్‌లో, 1.35 గంటలకు క్రోడస్‌ స్ట్రీట్‌లో కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ మూడు ఘటనలకు పరస్పరం సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

వివారాలు 

బర్మింగ్‌హామ్‌ కాల్పుల్లో ఒకరు మృతి

కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు.

అనుమానితులుగా భావిస్తున్న కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.

మరోవైపు, అలబామాలోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు.

డెలావెర్‌లోని నెవార్క్‌, అర్కన్సాస్‌లోని ఫయెట్‌విల్లేలో జరిగిన కాల్పుల ఘటనల్లో ఆరుగురు చొప్పున గాయపడ్డారు.

టెక్సస్‌లో జరిగిన మరో ఘటనలో ఒకరు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హాలోవీన్‌ వేడుకల్లో కాల్పుల కలకలం..

ADVERTISEMENT