LOADING...
Gaza: 2 ఏళ్ల తర్వాత గాజాలో పెళ్లి సందడి.. పెద్ద ఎత్తున సామూహిక వివాహాలు
2 ఏళ్ల తర్వాత గాజాలో పెళ్లి సందడి.. పెద్ద ఎత్తున సామూహిక వివాహాలు

Gaza: 2 ఏళ్ల తర్వాత గాజాలో పెళ్లి సందడి.. పెద్ద ఎత్తున సామూహిక వివాహాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 03, 2025
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా గాజా ప్రజలు అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, తాజాగా అక్కడ సామూహిక వివాహాలతో కొన్ని వేడుకలు ప్రారంభమయ్యాయి. యుద్ధంలో దెబ్బతిన్నఖాన్‌ యూనస్‌ ప్రాంతంలో 54 జంటలు వివాహ బంధంలో ఒక్కటయ్యాయి. పాలస్తీనియన్‌ సాంప్రదాయంలో వివాహాలు ఎల్లప్పుడూ ముఖ్యమైనవిగా భావించబడతాయి. అయితే, యుద్ధ పరిస్థితుల వల్ల ఇవి గతంలో ఆగిపోయాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ వేడుకలు మళ్లీ నిర్వహించారు. ఈ సామూహిక వివాహాలకు యూఏఈ మద్దతుతో మానవతా సహాయ కార్యక్రమాలు నిర్వహించే 'అల్‌ ఫారెస్‌ అల్‌ షాహిమ్‌' నిధులు నిధులను సమకూర్చాయి. ఈ సహాయంతో కొత్త జంటలకు కొంత నగదు, ఇతర అవసరమైన సామగ్రి కూడా అందించారు.

వివరాలు 

యుద్ధం వల్ల గాజాలో 2 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు

ఈ పెళ్లిలో పాలస్తీనియన్ జంటలు ఎమన్‌ హసన్‌ లావా,హిక్మత్‌లు కూడా తమ బంధాన్ని పటిష్టం చేసుకున్నారు. యుద్ధ పరిస్థితుల కారణంగా వీరు వేరే పట్టణంలో తాత్కాలికంగా స్థానం తీసుకుని ఉండవలసి వచ్చింది. ఆశ్రయం,ఆహారం కోసం అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. ఘర్షణల్లో తమ కుటుంబాన్ని కోల్పోవడం వల్ల జంట తీవ్ర ఆవేదనలో ఉంది. హిక్మత్‌ మాట్లాడుతూ,"సాధారణ జీవితాన్నిగడపడం..ఇల్లు,ఉద్యోగం,భార్య-పిల్లలతో ఉండాలని కలనలేదనుకున్నాను. యుద్ధంలో అన్నీ కోల్పోయాం.ఇప్పుడు జీవితం తిరిగి ప్రారంభించాలి,కానీ అది మేము ఊహించిన విధంగా ఉండదు," అని తెలిపారు. యుద్ధం కారణంగా గాజాలో సుమారు 2మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. ఇజ్రాయెల్‌ దాడుల వల్ల నగరాలు పూర్తిగా నశించిపోయాయి. ఇంకా ఈ ప్రాంతంలో మానవతా సహాయ సామగ్రి కొరత కొనసాగుతోంది,ఇది మానవీయ సంక్షోభాన్ని మరింత పెంచుతోంది.

Advertisement