LOADING...
Bangladesh: బంగ్లాదేశ్‌లో విజృంభిస్తున్న మీజిల్స్.. 130 మంది చిన్నారులు మృతి
బంగ్లాదేశ్‌లో విజృంభిస్తున్న మీజిల్స్.. 130 మంది చిన్నారులు మృతి

Bangladesh: బంగ్లాదేశ్‌లో విజృంభిస్తున్న మీజిల్స్.. 130 మంది చిన్నారులు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 06, 2026
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో మీజిల్స్‌ (మసూచి) వ్యాప్తి తీవ్ర రూపం దాల్చింది. గత ఆరు వారాల్లో కనీసం 130 మంది చిన్నారులు మృతిచెందినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో 113 మంది అనుమానిత కేసులు కాగా,17 కేసులు నిర్ధారితమయ్యాయి. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ప్రభుత్వం అత్యవసర టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 18 అధిక ప్రమాద జిల్లాల్లోని 30 ఉపజిల్లాల్లో ఈ డ్రైవ్‌ కొనసాగుతోంది. ఆరు నెలల నుంచి ఐదేళ్ల లోపు వయస్సు గల 13 లక్షలకుపైగా పిల్లలకు మీజిల్స్-రుబెల్లా టీకాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

వివరాలు 

పిల్లలను సమీప టీకా కేంద్రాలకు తీసుకురావాలని ప్రభుత్వం విజ్ఞప్తి

ముఖ్యంగా ఉత్తర బంగ్లాదేశ్‌లో వ్యాధి తీవ్రంగా ఉండటంతో అక్కడ పెద్ద సంఖ్యలో వైద్య సిబ్బందిని నియమించారు. మార్చి మధ్య నుంచి ఇప్పటివరకు దేశంలో 7,600కి పైగా అనుమానిత కేసులు నమోదయ్యాయి. రోజుకు వందల సంఖ్యలో పిల్లలు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. తక్కువ టీకాలు పొందిన ప్రాంతాల్లో ఈ వ్యాధి వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెంటనే టీకాలు వేయించుకోవడం ద్వారానే ప్రాణనష్టం తగ్గించవచ్చని, తల్లిదండ్రులు పిల్లలను సమీప టీకా కేంద్రాలకు తీసుకురావాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

Advertisement