Nepal: నేపాల్లో ఘోర బస్సు ప్రమాదం.. నదిలో పడిన బస్సు.. 18 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధాడింగ్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడిపోవడంతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. పొఖారా నుండి కాఠ్మాండూ వైపు ప్రయాణిస్తున్న ఈ బస్సు సోమవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. నియంత్రణ కోల్పోయిన వాహనం త్రిశూలీ నదిలోకి దూసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 27 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నదిలో పడిన బస్సు.
Such a sad reality of Nepal. Nepali public die like insects in road accidents literally every day and no one gives a fuck about it. If it was in developed nation, it would be in road crisis emergency red alert situation. pic.twitter.com/v1TfQtRyuo
— नेपालको सत्य (@thenepalitruth) February 23, 2026