Nepal Floods: భూకంపాలు,వరదలు,సునామీలు.. 26వ తేదీతో ముడిపడిన విపత్తులివే..
ఈ వార్తాకథనం ఏంటి
ఏడాదిలో 365 రోజులు ఉంటాయి. ప్రకృతి విపత్తులు ఏ రోజైనా సంభవించొచ్చు. ఒకట్రెండు ఘటనలు ఒకే తేదీన జరిగితే దాన్ని కాకతాళీయం లేదా యాదృచ్ఛికం అని భావించొచ్చు. కానీ భారీ సంఖ్యలో ప్రకృతి విపత్తులు పదేపదే ఒకే తేదీన సంభవిస్తే మాత్రం ఆసక్తి కలగడం సహజమే. ముఖ్యంగా 26వ తేదీన వరుసగా అనేక విపత్తులు చోటుచేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా నేపాల్‌లో భారీ వరదలు సంభవించాయి. అయితే చరిత్రను పరిశీలిస్తే గతంలోనూ ఇదే తేదీన ఎన్నో ప్రకృతి విపత్తులు సంభవించాయి. దాదాపు 96 ఏళ్లుగా 26వ తేదీతో ముడిపడిన ప్రకృతి విపత్తుల ఘటనలు కనిపిస్తున్నాయి. 1930లో టర్కీని వణికించిన భూకంపం నవంబరు 26న సంభవించింది. ఈ ఘటనలో 32,700 మంది ప్రాణాలు కోల్పోయారు.
వివరాలు
ఆగస్టు 26, 2026: నేపాల్‌ను ముంచెత్తిన మెరుపు వరదలు
ఆ తర్వాత కూడా సంవత్సరాలు, నెలలు మారుతున్నా.. భారీ ప్రకృతి విపత్తుల్లో కొన్ని 26వ తేదీనే చోటుచేసుకున్నాయి.
కేవలం ప్రకృతి వైపరీత్యాలే కాదు.. మానవ తప్పిదాల కారణంగా జరిగిన కొన్ని భారీ దుర్ఘటనలు కూడా ఇదే తేదీన సంభవించాయి. వాటిలో ముఖ్యమైన ఘటనలను పరిశీలిస్తే..
హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఓ హిమానీనదం అకస్మాత్తుగా విరిగి కిందికి జారిపడటంతో నేపాల్‌లోని రసువా జిల్లాలో భోటే కోశి నదికి ఆకస్మిక వరద వచ్చింది.
భారీగా వచ్చిన నీటితో పలు గ్రామాలు మునిగిపోయాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి.
జలవిద్యుత్ ప్రాజెక్టులతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
వివరాలు
అక్టోబర్ 26, 2015: హిందూకుష్ భూకంపం
ఆగస్టు 31 నాటికి ఈ ఘటనలో 900 మందికి పైగా మరణించగా.. సుమారు 4,500 మంది గల్లంతయ్యారు.
హిందూకుష్ ప్రాంతంలో 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావం భారతదేశంతో పాటు అఫ్గానిస్తాన్, పాకిస్థాన్, ఉత్తర ప్రాంతాల్లోనూ కనిపించింది. ఈ భూకంపం కారణంగా దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోయారు.
మే 26, 2006: యోగ్యకర్త భూకంపం
ఇండోనేసియాలోని జావా ద్వీపంలో యోగ్యకర్తకు సమీప ప్రాంతంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ప్రకంపనల ధాటికి వేలాది ఇళ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ప్రకృతి విపత్తులో 5,700 మందికి పైగా మృతి చెందారు.
వివరాలు
జూలై 26, 2005: మహారాష్ట్రలో భారీ వరదలు
భారీ వర్షాలతో మహారాష్ట్ర అతలాకుతలమైంది. ముంబై నగరంలో ఒక్క రోజులోనే 944 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరద నీరు రోడ్లు, ఇళ్లు, రైల్వే మార్గాలను ముంచెత్తింది. దీంతో సాధారణ జనజీవనం పూర్తిగా స్తంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ విపత్తు కారణంగా 1,094 మంది ప్రాణాలు కోల్పోయారు.
డిసెంబర్ 26, 2004: హిందూ మహాసముద్రాన్ని వణికించిన సునామీ
సుమత్రా తీరానికి సమీపంలో సముద్ర గర్భంలో 9.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.
దాని ప్రభావంతో ఏర్పడిన సునామీ హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాలపై విరుచుకుపడింది.
ఇండోనేసియా,శ్రీలంక,భారత్,థాయిలాండ్ తీవ్రంగా నష్టపోయాయి. దాదాపు 2,28,000మంది ప్రాణాలు కోల్పోగా.. మరెంతోమంది ఆచూకీ లేకుండా పోయారు. ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రాణాంతక ప్రకృతి విపత్తుల్లో ఈ సునామీ ఒకటిగా నిలిచింది.
వివరాలు
డిసెంబర్ 26, 2003: ఇరాన్‌లో బామ్ భూకంపం
ఇరాన్‌లో 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపం చారిత్రక నగరమైన బామ్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాలను తీవ్రంగా ధ్వంసం చేసింది. వేలాది భవనాలు కూలిపోయి శిథిలాలుగా మారాయి. ఈ ప్రకృతి విపత్తులో సుమారు 31,000 మంది మృతి చెందినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
మార్చి 25-26, 2002: వరుస భూకంపాలతో అఫ్గానిస్తాన్‌లో విషాదం
ఉత్తర అఫ్గానిస్తాన్‌లోని బఘ్లాన్ ప్రాంతంలో రాత్రి సమయంలో వరుసగా భూకంపాలు సంభవించాయి. ఈ ప్రకంపనల కారణంగా సుమారు 1,800 మంది ప్రాణాలు కోల్పోయారు. మట్టి ఇళ్లు పెద్ద సంఖ్యలో కూలిపోవడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
వివరాలు
జనవరి 26, 2001: గుజరాత్‌ను కుదిపేసిన భూకంపం
2001 జనవరి 26న గుజరాత్‌లో అత్యంత తీవ్ర భూకంపం సంభవించింది. ముఖ్యంగా కచ్ ప్రాంతం భారీగా దెబ్బతింది. ఈ విపత్తులో సుమారు 20,000 మంది మరణించగా.. 1,66,000 మందికి పైగా గాయపడ్డారు. భారీగా భవనాలు, ఇతర నిర్మాణాలు ధ్వంసమయ్యాయి.
జూలై 26, 1963: స్కోప్జే భూకంపం
అప్పటి యుగోస్లేవియాలోని స్కోప్జే నగరాన్ని 6.1 తీవ్రతతో సంభవించిన భూకంపం తీవ్రంగా దెబ్బతీసింది. నగరంలోని భారీ నిర్మాణాలు కూలిపోయాయి. ఈ ఘటనలో 1,070 మంది మరణించగా.. సుమారు 2,00,000 మంది నిరాశ్రయులయ్యారు.
వివరాలు
నవంబర్ 26, 1943: టర్కీలో లాడిక్ భూకంపం
టర్కీలోని లాడిక్-సామ్‌సన్-హవ్జా ప్రాంతాల్లో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో టర్కీ ఉత్తర ప్రాంతంలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఈ ఘటనలో 4,020 మంది మృతి చెందారు.
డిసెంబర్ 26-27, 1939: ఎర్జింకాన్ భూకంపం
టర్కీలోని ఎర్జింకాన్ ప్రాంతంలో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రకంపనల కారణంగా 32,700 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం కూడా నమోదైంది.
వివరాలు
మానవ తప్పిదాలతో జరిగిన ఘోర ఘటనలు
ప్రకృతి విపత్తుల విషయాన్ని పక్కనపెడితే.. మానవ తప్పిదాలు, నిర్లక్ష్యం లేదా ఇతర కారణాలతో చోటుచేసుకున్న కొన్ని భారీ దుర్ఘటనలు కూడా 26వ తేదీనే జరిగాయి.
సెప్టెంబర్ 26, 2023: ఖరాఖోష్ వెడ్డింగ్ హాల్ అగ్నిప్రమాదం
ఇరాక్‌లోని మోసుల్ సమీపంలోని ఖరాఖోష్‌లో ఓ వివాహ వేడుక జరుగుతున్న సమయంలో వెడ్డింగ్ హాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భవనం లోపలే పటాకులు కాల్చడంతో మంటలు చెలరేగాయి. పైరోటెక్నిక్స్ కారణంగా మండే పదార్థాలకు నిప్పంటుకుంది. అప్పటికే జనంతో నిండిన హాల్‌లో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ఘటనలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.
వివరాలు
ఆగస్టు 26, 2021: కాబూల్ విమానాశ్రయం వద్ద బాంబు పేలుడు
అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ బాంబు పేలుడులో మొత్తం 183 మంది మృతి చెందారు. మృతుల్లో 170 మంది అఫ్గాన్ పౌరులు కాగా.. 13 మంది అమెరికా సైనికులు ఉన్నారు.
నవంబర్ 26, 2008: ముంబైపై ఉగ్రవాదుల దాడి
దేశాన్ని తీవ్రంగా కుదిపేసిన ఉగ్రవాద దాడుల్లో 2008 ముంబై దాడులు అత్యంత ఘోరమైనవి.
నవంబర్ 26 రాత్రి పాకిస్థాన్‌కు చెందిన లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన పది మంది ఉగ్రవాదులు ముంబైలోకి ప్రవేశించారు.
అనంతరం ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ సహా పలు ప్రాంతాల్లో ఏకకాలంలో కాల్పులకు తెగబడ్డారు.
వివరాలు
మే 26, 1991: లాడా ఎయిర్ ఫ్లైట్ 004 ప్రమాదం
ఈ దాడులు దాదాపు మూడు రోజుల పాటు కొనసాగాయి. భద్రతా బలగాల చర్యల్లో తొమ్మిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఉగ్రదాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోగా.. 300 మందికి పైగా గాయపడ్డారు.
బ్యాంకాక్ నుంచి వియన్నాకు ప్రయాణిస్తున్న లాడా ఎయిర్‌కు చెందిన బోయింగ్ 767 విమానం థాయిలాండ్‌లో కూలిపోయింది. విమానంలోని ఇంజన్ థ్రస్ట్ రివర్సర్ అనూహ్యంగా పనిచేయడంతో విమానం నియంత్రణ కోల్పోయింది. అనంతరం విమానం ముక్కలై కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 223 మంది ప్రాణాలు కోల్పోయారు.