Loading...
New Jersey: అమెరికా న్యూజెర్సీలో దారుణం.. కాల్పుల్లో ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు
అమెరికా న్యూజెర్సీలో దారుణం.. కాల్పుల్లో ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు

New Jersey: అమెరికా న్యూజెర్సీలో దారుణం.. కాల్పుల్లో ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2026
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. అమెరికా రాష్ట్రంలోని ఎలిజబెత్‌ నగరంలో సోమవారం రాత్రి జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. కాల్పుల అనంతరం నిందితుడు ఎరుపు రంగు సెడాన్‌ కారులో అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎలిజబెత్‌ నగరంలోని ఇర్వింగ్‌టన్‌ అవెన్యూ, ఎల్మ్‌వుడ్‌ ప్లేస్‌ సమీపంలో సోమవారం రాత్రి సుమారు 8.30 గంటలకు కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు ఎలిజబెత్‌ పోలీసులు ధ్రువీకరించారు. అయితే మృతుడు, గాయపడిన వారి పూర్తి వివరాలను అధికారులు వెంటనే వెల్లడించలేదు.

వివరాలు 

క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స

కాల్పుల్లో గాయపడిన వారికి వైద్యం అందించేందుకు అత్యవసర సేవల సిబ్బంది రంగంలోకి దిగారు.

రాత్రి 9.45 గంటలకు ముందే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

తొలుత అందిన సమాచారం ప్రకారం.. ముగ్గురికి కాళ్లలో బుల్లెట్‌ గాయాలు కాగా, మరొకరికి ఛాతీ భాగంలో గాయమైంది.

క్షతగాత్రులను నెవార్క్‌లోని యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

వివరాలు 

పలు ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు

కాల్పులు జరిగిన ప్రాంతంలో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి తనిఖీలు చేపట్టారు.

కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఎరుపు రంగు సెడాన్‌ కారులో పశ్చిమ దిశగా మోరిస్‌ అవెన్యూ వైపు వెళ్లినట్లు గుర్తించారు.

ఆ వాహనం ఎరుపు రంగు నిస్సాన్‌ కారై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

నిందితుడు కాల్పుల కోసం పొడవైన తుపాకీని ఉపయోగించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనపై యూనియన్‌ కౌంటీ ప్రాసిక్యూటర్‌ కార్యాలయానికి కూడా సమాచారం అందించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

కాల్పులకు దారితీసిన కారణాలు, నిందితుడి వివరాలను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎలిజబెత్‌ నగరంలో కాల్పులు.. నిందితుడి కోసం పోలీసుల గాలింపు

ADVERTISEMENT