
Norovirus: లగ్జరీ క్రూయిజ్ షిప్‌లో నోరోవైరస్.. 200 మందికి పైగా ప్రయాణికులకు అస్వస్థత
ఈ వార్తాకథనం ఏంటి
ఒక పెద్ద పర్యాటక నౌకలో నోరో వైరస్ (Norovirus)భయాందోళనకు గురిచేస్తోంది.
క్వీన్ మేరీ 2 అనే లగ్జరీ క్రూయిజ్ నౌకలో ఈ వైరస్ ప్రభావంతో 200 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.
యునైటెడ్ స్టేట్స్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ఈ విషయాన్ని ధృవీకరించినట్లు వార్తా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
క్రూయిజ్ ట్రిప్ వివరాలు
క్వీన్ మేరీ 2,కునార్డ్ లైన్స్ ఆధ్వర్యంలో నడిచే ఈ క్రూయిజ్ నౌక మార్చి 8న ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ నుండి తూర్పు కరేబియన్ దీవులకు ప్రయాణం ప్రారంభించింది.
మొత్తం 2,538 మంది ప్రయాణికులు,1,232 మంది సిబ్బంది నౌకలో ఉన్నారు. అందులో 224 మంది ప్రయాణికులు, 17 మంది సిబ్బంది నోరో వైరస్‌కు గురైనట్లు నిర్ధారణ అయింది.
వివరాలు
మిగిలిన ప్రయాణికులకు వ్యాధి సోకకుండా తగిన జాగ్రత్తలు
ట్రాకింగ్ సైట్ ప్రకారం, మార్చి 18న ఈ నౌక న్యూయార్క్‌లో ఆగినప్పుడు వైరస్ వ్యాప్తి చెందిన అవకాశం ఉంది.
కునార్డ్ సంస్థ ప్రకారం, వైరస్ సోకినవారికి తగిన చికిత్స అందించడంతో పాటు, నౌకను పూర్తిగా శుభ్రపరిచారు.
అలాగే మిగిలిన ప్రయాణికులకు వ్యాధి సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం క్వీన్ మేరీ 2 నౌక నార్త్ వెస్ట్ అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం కొనసాగిస్తూ, తిరిగి సౌతాంప్టన్ వైపుగా సాగుతోంది.
మొత్తం 29 రోజుల ప్రయాణం కాగా, ఏప్రిల్ 6న ఇది ముగియనుంది.
వివరాలు
నోరో వైరస్ అంటే ఏమిటి?
నోరో వైరస్‌ను సాధారణంగా 'వామిటింగ్ బగ్' అని కూడా పిలుస్తారు. ఇది అత్యంత వేగంగా వ్యాపించే వైరస్‌గా గుర్తింపు పొందింది.
అన్ని వయస్సుల వారికీ సోకే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందని అమెరికన్ CDC స్పష్టంచేసింది.
నోరో వైరస్ సంక్రమించిన 12 నుంచి 48 గంటల్లో లక్షణాలు బయటపడతాయి. ఇవి సాధారణంగా 3 రోజుల వరకు కొనసాగుతాయి.
ప్రధాన లక్షణాలు:
విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి, వికారం, జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు
వివరాలు
వృద్ధులు, చిన్న పిల్లలకు డీహైడ్రేషన్ సమస్య
ఈ వైరస్ సోకిన వ్యక్తులు వాడిన పాత్రలు, కలిసిన ఆహారం, ప్రాపర్టీల ద్వారా మరింత వ్యాప్తి చెందుతుంది.
మలం ద్వారా నమూనాలు పరీక్షించడం ద్వారా దీనిని నిర్ధారించవచ్చు. అయితే, ఎక్కువ మంది బాధితులు ప్రత్యేకమైన చికిత్స లేకుండానే కోలుకుంటారు.
కానీ, వృద్ధులు, చిన్న పిల్లలు, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారు డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కొనే అవకాశముంది.
సాధారణంగా, బాధితులు మూడు రోజుల్లో కోలుకోవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.