Afghanistan: అఫ్గాన్‌పై పాక్ వైమానిక దాడులు.. 11 మంది చిన్నారులతో సహా పలువురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఆఫ్ఘనిస్తాన్-పాకిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అఫ్గాన్‌లోని పౌర నివాస ప్రాంతాలపై పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడిందని తాలిబన్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు అఫ్గాన్ అధికారులు వెల్లడించారు. అఫ్గాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఖోస్ట్,కునార్,పక్తికా ప్రావిన్స్‌లలోని పౌరుల నివాసాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ బాంబు దాడులు నిర్వహించింది. ఈ ఘటనలో 11మంది అమాయక చిన్నారులు,ఓ మహిళ,ఓ వృద్ధుడు మృతి చెందినట్లు ఆయన వెల్లడించారు. మరో 14మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. పౌర ప్రాంతాలపై జరిగిన ఈ దాడులతో అఫ్గాన్‌లో ఆందోళన నెలకొంది. అయితే ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అఫ్గాన్‌లో పాక్ దాడులు
Afghanistan says Pakistani airstrikes targeting the country killed at least 13 people and wounded 14, reports AP. pic.twitter.com/a0EoQx1VtP
— Press Trust of India (@PTI_News) June 10, 2026