LOADING...
Pakistan Gold Discovery: పాకిస్థాన్ పసిడిమయం.. సింధు నదిలో భారీగా బంగారం నిక్షేపాలు..  
పాకిస్థాన్ పసిడిమయం.. సింధు నదిలో భారీగా బంగారం నిక్షేపాలు

Pakistan Gold Discovery: పాకిస్థాన్ పసిడిమయం.. సింధు నదిలో భారీగా బంగారం నిక్షేపాలు..  

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 06, 2025
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని నౌషెరా ఒక వెనుకబడి ప్రాంతం. అయితే, ఇక్కడ జరిగిన పరిశోధనల్లో బంగారు నిక్షేపాలు కనుగొనడంతో ఈ ప్రాంతం ఇప్పుడు బంగారు భూభాగంగా మారిపోయింది. సింధు నది ఒడ్డున భారీ స్థాయిలో బంగారం తవ్వకాలు జరుగుతున్నాయి, దీనివల్ల ఈ ప్రాంత ఆర్థిక స్థితిలో గణనీయమైన మార్పులు వచ్చాయి. కుండ్ నుంచి నిజాంపూర్ వరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలు వేగంగా పెరుగుతున్నాయి. సింధు నదిలో బంగారు నిక్షేపాల ఆవిష్కరణ నౌషెరాను ఒక ప్రధాన మైనింగ్ కేంద్రంగా మార్చింది.

వివరాలు 

కార్మికుడికి రోజుకు రూ.1000 నుంచి రూ.1500వరకు వేతనం

పాకిస్తాన్‌కి చెందిన ప్రముఖ వార్తాపత్రిక డాన్ తెలిపిన సమాచారం ప్రకారం,సింధు నదిలో మైనింగ్ పనులు నిరంతరం కొనసాగుతున్నాయి. మట్టిని తీసి బంగారు రేణువులను వెతికి పట్టుకునే విధంగా తవ్వకాలు సాగుతున్నాయి.ఈ మైనింగ్ వల్ల స్థానిక కార్మికులకు కూడా ఉపాధి పెరిగింది. ఒక కార్మికుడికి రోజుకు రూ.1000 నుంచి రూ.1500వరకు వేతనం అందిస్తున్నారు,దీని వలన వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. నౌషెరాలోని సింధు,కాబూల్ నదుల సంగమ ప్రాంతంలో ప్లేసర్ బంగారు తవ్వకం ఈ ప్రాంత ఆర్థిక స్థితిని మార్చేసింది. గతంలో ఇక్కడ చిన్న స్థాయిలో మాత్రమే మైనింగ్ జరగింది,కానీ ఇటీవలి నెలలుగా ఈ తవ్వకాలు భారీ స్థాయికి చేరాయి. నది అడుగున ఉన్న బంగారాన్ని వెలికి తీయడానికి పెద్దసంఖ్యలో ప్రజలు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారు.

వివరాలు 

తవ్వకాలు సింధు నది పర్యావరణ వ్యవస్థను దెబ్బతీస్తాయనే హెచ్చరిక

అటాక్ సమీపంలో రూ.800 బిలియన్‌ విలువైన బంగారు నిల్వలు ఉన్నాయనే వాదనలతో ఈ ప్రాంతం అంతటి ఆకర్షణీయంగా మారింది. పాకిస్తాన్ జియోలాజికల్ సర్వే(GSP)నివేదిక ప్రకారం,పంజాబ్ రాష్ట్ర మాజీ గనులు,ఖనిజాల మంత్రి ఇబ్రహీం హసన్ మురాద్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. దీని వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుంటున్నారు.కానీ, పర్యావరణవేత్తలు ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక వేగంతో సాగుతున్న తవ్వకాలు సింధు నది పర్యావరణ వ్యవస్థను దెబ్బతీస్తాయనే హెచ్చరికలు చేస్తున్నారు. నదిలో తవ్వకాలు చేపల సంఖ్య తగ్గించవచ్చని, ఇది జలచరాలపై తీవ్ర ప్రభావం చూపించవచ్చని తెలిపారు. అంతేకాదు, బంగారం తీయడానికి వాడే పాదరసం నదీ జలాల నాణ్యతను దెబ్బతీస్తుందని, దీని ప్రభావం పర్యావరణ సమతుల్యతపై పడుతుందని సూచిస్తున్నారు.