LOADING...
Bangladesh: పార్లమెంట్ ఎన్నికల వేళ పోలింగ్ బూత్‌లు, పాఠశాలలకు నిప్పు 
Bangladesh: పార్లమెంట్ ఎన్నికల వేళ పోలింగ్ బూత్‌లు, పాఠశాలలకు నిప్పు

Bangladesh: పార్లమెంట్ ఎన్నికల వేళ పోలింగ్ బూత్‌లు, పాఠశాలలకు నిప్పు 

వ్రాసిన వారు Stalin
Jan 06, 2024
02:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

జనవరి 7న బంగ్లాదేశ్‌లో పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నాలుగు పోలింగ్ బూత్‌లతో పాటు ఐదు ప్రాథమిక పాఠశాలలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. రాజధాని ఢాకా శివార్లలోని గాజీపూర్‌లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆదివారం జరగనున్న ఎన్నికలకు అంతరాయం కలిగించే లక్ష్యంతో దుండగులు శుక్రవారం అర్ధరాత్రి పాఠశాలలకు నిప్పుపెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎన్నికలను బహిష్కరించిన నేపథ్యంలో ఈ హింసాత్మక సంఘటనలు జరగడం గమనార్హం.

పెట్రోలింగ్‌ ముమ్మరం చేసిన పోలీసులు

పెట్రోలింగ్‌ ముమ్మరం చేసిన పోలీసులు

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తాము పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసినట్లు గాజీపూర్ పోలీసు చీఫ్ కాజీ షఫీకుల్ ఆలం చెప్పారు. ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎస్‌పీ) ఎన్నికలను బహిష్కరించింది. దొంగ ఒట్లతో ప్రస్తుత ప్రధాన మంత్రి షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ వరుసగా నాల్గవసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష బీఎస్‌పీ ఆరోపిస్తోంది. ఎన్నికలకు దూరంగా ఉండాలని పౌరులను బీఎన్‌పీ కోరింది. దీంతో దేశంలో శనివారం, ఆదివారం నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో దేశంలో చెలరేగిన హింసను ప్రతిపక్ష బీఎన్‌పీ ప్రేరేపిస్తోందని ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు.