New Zealand: న్యూజిలాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. భారత సంతతి వ్యక్తి మృతి
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్‌లో భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. పంజాబ్‌కు చెందిన రమన్‌దీప్ ధిల్లన్ (36) పాపామోవా ప్రాంతంలో ఉబెర్ డ్రైవర్‌గా పనిచేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. టే పూకే హైవేపై బెల్ రోడ్, పోప్లర్ లేన్ మధ్య రెండు వాహనాల ఢీకొన్న ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వాహనంలో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.
వివరాలు
స్టూడెంట్ వీసాతో న్యూజిలాండ్‌కు..
రమన్‌దీప్ ధిల్లన్ 2015లో స్టూడెంట్ వీసాపై న్యూజిలాండ్‌కు వెళ్లాడు. అనంతరం 2024లో భారత్‌కు వచ్చి వీర్‌పాల్ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత భార్యతో కలిసి తిరిగి న్యూజిలాండ్ వెళ్లిన ఈ జంట పాపామోవాలో స్థిరపడింది. అక్కడ ఇద్దరూ కివీఫ్రూట్ తోటల్లో పనిచేస్తూ జీవనం సాగించారు. కూతురు కోసం ఉబెర్ డ్రైవింగ్ కూతురు కుద్రత్ జన్మించిన తర్వాత కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలనే ఉద్దేశంతో ధిల్లన్ ఉబెర్ డ్రైవింగ్ ప్రారంభించాడు. పని సమయాల్లో కొంత స్వేచ్ఛ ఉండటంతో కుటుంబంతో గడపడానికి అవకాశం ఉంటుందని భావించాడు.
వివరాలు
'డిన్నర్‌కు వస్తా' అన్నాడు..
ప్రమాదం జరిగిన రోజు సాయంత్రం కూడా తన 18 నెలల చిన్నారితో కొంతసేపు ఆడుకున్న ధిల్లన్, ఇంటి నుంచి బయలుదేరే ముందు "తిరిగి వచ్చి కలిసి డిన్నర్ చేద్దాం" అని భార్యకు చెప్పినట్లు ఆమె తెలిపింది. అయితే రాత్రి అయ్యాక ఆయన ఫోన్‌కు స్పందించకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. కొద్దిసేపటికే పోలీసులు ఇంటికి చేరుకుని ప్రమాదంలో ఆయన మృతి చెందినట్లు సమాచారం ఇచ్చారు. భార్య ఆవేదన భర్త మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయిన వీర్‌పాల్ కౌర్ కన్నీరుమున్నీరయ్యారు. "నా జీవితం ఒక్కసారిగా చీకట్లోకి వెళ్లిపోయింది.ఆయన చాలా మంచి మనసున్న వ్యక్తి. నన్నెంతో ప్రేమగా చూసుకునేవారు" అంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
వివరాలు
'గివ్ ఎ లిటిల్' పేరుతో ప్రత్యేక నిధి సేకరణ
తమ కూతురు కూడా తరచూ తండ్రి కోసం అడుగుతోందని, ఆమె నవ్వు కూడా తన భర్తలాగే ఉంటుందని చెప్పారు. ధిల్లన్ అంత్యక్రియలు బుధవారం నిర్వహించగా, న్యూజిలాండ్ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు 'గివ్ ఎ లిటిల్' పేరుతో ప్రత్యేక నిధి సేకరణ ప్రారంభించగా, ఇప్పటికే 33 వేల డాలర్లకు పైగా విరాళాలు వచ్చినట్లు సమాచారం.