
Georgia Protests 2025: జార్జియాలో నిరసనలు.. అసలు రష్యాకు సంబంధం ఏమిటో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రజలు ప్రభుత్వ నీతులపై నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ నిరసనల పరంపర నేపాల్‌లో ప్రారంభమై, తరువాత ఇతర పక్క దేశాలకు వ్యాప్తి చెందుతుంది. తాజాగా జార్జియాలో ప్రభుత్వం వ్యతిరేకంగా నిరసనలు చెలరేగాయి. శనివారం ఆ దేశంలో స్థానిక ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలతో గత ఏడాది కాలంగా నిరసనలు కొనసాగుతున్నాయి. విశ్లేషకుల ప్రకారం ఈసారి జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రజలను వీధుల్లోకి మళ్లీ తరలించాయి. నిరసనకారులు దేశ రాజధాని టిబిలిసిలోని అధ్యక్ష భవనాన్ని ముట్టడించడానికి ప్రయత్నించారు.
Details
అధికార పార్టీకి వ్యతిరేకంగా నిరసనలు
జార్జియాలో అధికార "జార్జియన్ డ్రీమ్" (Georgian Dream) పార్టీకి వ్యతిరేకంగా నిరసన చూపడానికి వేలాది మంది నిరసనకారులు అధ్యక్ష భవనంలోకి చొరబడటానికి యత్నించారు. ఒకప్పుడు పాశ్చాత్య అనుకూల దేశంగా పరిగణించిన జార్జియా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పశ్చిమ దేశాలతో సంబంధాల ఒత్తిడిని ఎదుర్కొంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజలు అధికార పార్టీ రష్యా పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. ఎన్నికల తరువాత లక్షలాది మంది ప్రజలు అధ్యక్ష భవనం వెలుపల గుమిగూడారు. ఈ సమయంలో పోలీసులు జనసమూహాన్ని నియంత్రించడానికి కఠినంగా ప్రయత్నించారు. ఐదుగురు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Details
నిరసనల్లో పాల్గొన్నవారు
దేశ రాజధాని టిబిలిసిలో జరిగిన ర్యాలీకి 20 వేల మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. నిరసన ప్రదర్శనకు ప్రసిద్ధ ఒపెరా గాయని మరియు సామాజిక కార్యకర్త పాటా బుర్చులాడ్జే, అలాగే ప్రతిపక్ష నాయకులు నాయకత్వం వహించారు. వీరు గత ఏడాది నుంచి దాదాపు రోజువారీ నిరసనలు నిర్వహిస్తున్నారు. జనసమూహంలో చాలామంది జార్జియా మరియు యూరోపియన్ యూనియన్ జెండాలను పట్టుకున్నారు.
Details
నిరసనలకు కారణాలు
ప్రజలు 2024 పార్లమెంటరీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, అధికార జార్జియన్ డ్రీమ్ పార్టీ చట్టవిరుద్ధంగా అధికారాన్ని నిలుపుకున్నదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం రాజీనామా చేసి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, EU సభ్యత్వ చర్చలను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ప్రతిపక్ష నాయకులు, స్వతంత్ర మీడియా, పౌర సమాజంపై పెరుగుతున్న అణచివేతకు కూడా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో జార్జియన్ డ్రీమ్ పార్టీ అన్ని మున్సిపాలిటీలలో విజయం సాధించినప్పటికీ ప్రజల అసంతృప్తి తగ్గలేదు.
Details
రష్యా సంబంధాలపై ఆగ్రహం
అధికార పార్టీ రష్యా అనుకూలమని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక విదేశీ వార్తా సంస్థ ప్రకారం, గత ఏడాది ఓటింగ్ తర్వాత ప్రభుత్వం EU ప్రవేశ చర్చలను నిలిపివేసింది. దీంతో దేశంలో నిరసనలు కొనసాగుతున్నాయి. జార్జియా అధ్యక్షురాలు సలోమ్ జురాబిష్విలి తాజాగా నిరసనలను ఖండిస్తూ, ''జార్జియన్ ప్రజల 310 రోజుల శాంతియుత నిరసనను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని చూస్తున్నాను. చట్టబద్ధమైన అధ్యక్షురాలిగా, దీన్ని తీవ్రంగా తిరస్కరిస్తున్నాను'' అని ప్రకటించారు.
Details
నిరసనకారుల డిమాండ్లు
నిరసన సందర్భంలో పాటా బుర్చులాడ్జే నిరసనకారుల డిమాండ్లను ప్రకటించారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజల అభిప్రాయాన్ని అంగీకరించాలి, ప్రధానమంత్రి సహా జార్జియన్ డ్రీమ్ పార్టీకి చెందిన ఆరుగురు సీనియర్ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి కొత్త పార్లమెంటరీ ఎన్నికలు నిర్వహించాలని, దాదాపు 60 మంది రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నారు.