Putin: రష్యా గడ్డు పరిస్థితుల్లో ఉంది.. అన్ని సవాళ్లను అధిగమిస్తాం: పుతిన్
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ, ఈ పరిణామాలు దేశానికి ఎన్నో విలువైన అనుభవాలు, పాఠాలను అందించాయని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆదివారం తెలిపారు. ఇటీవల ఉక్రెయిన్ డ్రోన్ దాడులు రష్యాలోని కీలక ఇంధన మౌలిక సదుపాయాలు,చమురు శుద్ధి కర్మాగారాలను లక్ష్యంగా చేసుకుని తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో పుతిన్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. రాబోయే పార్లమెంటరీ ఎన్నికల నేపథ్యంలో అధికార యునైటెడ్ రష్యా పార్టీ కాంగ్రెస్‌లో ప్రసంగించిన ఆయన, రష్యా భూభాగంపై జరుగుతున్న ఉగ్రవాద దాడులను సమర్థంగా అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
వివరాలు
క్రస్నోడార్‌లోని ఆయిల్ రిఫైనరీపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి
దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అన్ని సవాళ్లను నిస్సందేహంగా అధిగమిస్తామని పుతిన్ ధీమా వ్యక్తం చేసినట్లు రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్ వెల్లడించింది. క్రస్నోడార్‌లోని ఆయిల్ రిఫైనరీపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేసిన కొద్ది గంటలకే పుతిన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రష్యాపై ఉగ్రదాడులను తిప్పికొడతాం.. పుతిన్ స్పష్టం
Путин признал «определенный дефицит» после ударов ВСУ по инфраструктуре, но «все у нас работает стабильно и с большим запасом прочности» — подробности читайте в треде pic.twitter.com/1fhe1PMD5M
— Дождь (@tvrain) June 29, 2026