
Putin: భారత్ పర్యటనకు రానున్న పుతిన్
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) చేసిన ఆహ్వానాన్ని పుతిన్ అంగీకరించినట్లు రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకటించారు.
'రష్యా అండ్ ఇండియా: టువర్డ్ ఏ బైలాటరల్ అజెండా' పేరుతో రష్యన్ ఇంటర్నేషనల్ అఫైర్స్ కౌన్సిల్ (RIAC) నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో లావ్రోవ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
పర్యటన కోసం ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. భారత ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం మోదీ తన తొలి అంతర్జాతీయ పర్యటనను రష్యాలో చేసిన విషయాన్ని లావ్రోవ్ గుర్తు చేశారు.
ఇప్పుడు పుతిన్ పర్యటనతో ప్రతిస్పందన ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే, పర్యటన తేదీలను మాత్రం ఇంకా ప్రకటించలేదు.
Details
గత పర్యటనలు
మోదీ గతేడాది జులైలో రష్యా పర్యటనకు వెళ్లారు. ఐదేళ్ల తర్వాత రష్యా వెళ్లడం అదే తొలిసారి.
అంతకుముందు 2019లో వ్లాదివోస్టోక్‌లో జరిగిన ఆర్థిక సదస్సులో మోదీ పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా పుతిన్ భారత్‌లో పర్యటించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
పర్యటన ప్రాధాన్యత
అమెరికా నుంచి టారిఫ్‌ల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో పుతిన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపునకు సంప్రదింపులు జరుగుతున్న సమయంలో పుతిన్ పర్యటన మరింత కీలకంగా మారింది.
ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు మరింత బలం చేకూర్చనుంది.