Page Loader
Pakistan: అప్గాన్‌పై పాక్ బాంబుల వర్షం.. 15 మంది మృతి
అప్గాన్‌పై పాక్ బాంబుల వర్షం.. 15 మంది మృతి

Pakistan: అప్గాన్‌పై పాక్ బాంబుల వర్షం.. 15 మంది మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 25, 2024
08:52 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌ అఫ్గానిస్థాన్‌పై వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా మొత్తం 15 మంది మరణించారు. పక్తికా ప్రావిన్స్‌లోని బార్మల్‌ జిల్లా పరిధిలో ఏడు గ్రామాలు ఈ దాడుల్లో లక్ష్యంగా మారాయి. ఈ దాడులకు పాకిస్థాన్‌ యుద్ధ విమానాలే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరణించిన వారిలో ఎక్కువ మంది వజీరిస్థానీ శరణార్థులుగా గుర్తించారు. ఈ దాడులపై తాలిబన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్రంగా వ్యతిరేకించింది.

Details

ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన తాలిబన్

ఈ చర్యకు ప్రతిస్పందనగా ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబన్‌ ప్రకటించింది. భద్రతా వర్గాల ప్రకారం, సరిహద్దు సమీపంలోని తాలిబన్‌ రహస్య స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపినట్లు చెబుతున్నారు. అయితే ఈ దాడులు పాకిస్థాన్‌ వైమానిక దళం చేతివాటేనని ఇప్పటివరకు పాక్‌ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఇటీవల పాక్‌-అఫ్గాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పాక్‌ దేశంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడులకు తాలిబన్లే కారణమని పాకిస్థాన్‌ ఆరోపించగా, తాలిబన్‌ ఈ ఆరోపణలను ఖండించింది. ఈ పరిణామాల మధ్య పాక్‌ వైమానిక దాడులు చేయడం ప్రత్యేకమైన దృష్టిని ఆకర్షిస్తోంది.