NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Masoud Pezeshkian: ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్ కు పట్టం
    తదుపరి వార్తా కథనం
    Masoud Pezeshkian: ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్ కు పట్టం
    Masoud Pezeshkian: ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్ కు పట్టం

    Masoud Pezeshkian: ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్ కు పట్టం

    వ్రాసిన వారు Stalin
    Jul 06, 2024
    02:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాద అభ్యర్థి మసౌద్ పెజెష్కియాన్ విజయం సాధించించారని టెహ్రాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ప్రెస్ టీవీ తెలిపింది.

    శనివారం ప్రకటించిన ఫలితాలు, శుక్రవారం నాటి మొత్తం పోలైన ఓట్లను లెక్కించారు. వాటిలో 30.5 మిలియన్ల ఓట్లకు గాను పెజెష్కియాన్ 16.3 మిలియన్లకు పైగా ఓట్లను సాధించారు.

    13.5 మిలియన్లకు పైగా ఓట్లను సాధించిన ఆయన అల్ట్రాకన్సర్వేటివ్ ప్రత్యర్థి సయీద్ జలీలీని అధిగమించారు.

    మే నెలలో ఇరాన్ గ్రామీణ వాయువ్య ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించిన సంగతి తెలిసిందే.

    ఆయనతో పాటు విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్దోల్లాహియాన్ , ఇతర అధికారులు ప్రాణాలు కోల్పోయారు. దాని తర్వాత ముందస్తు ఎన్నికలు జరిగాయి.

    వివరాలు 

    ఇరాన్ రాజకీయ , ఆర్థిక సవాళ్ల మధ్య పెజెష్కియాన్ విజయం 

    అధ్యక్షుడి రేసులో ఉన్న ఏకైక సంస్కరణవాద అభ్యర్థి పెజెష్కియాన్ పలు సవాళ్లను ఎదుర్కోనున్నారు.

    వాటిలో ఇప్పుడు పెరుగుతున్న అంతర్జాతీయంగా ఒంటరైపోయిన టెహ్రాన్ ను మళ్లీ యధాతధ స్దితికి తీసుకు రావాల్సి వుంది.

    దేశంలో అశాంతి, కునారిల్లిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాల్సి వుంటుంది. దీనికి తోడు , ఇజ్రాయెల్‌తో పరోక్షంగా పోరాడుతున్న దేశానికి నాయకత్వం వహించాలి.

    ఇరాన్‌లో అధ్యక్షుడికి కొన్ని అధికారాలు మంజూరు చేసి నప్పటికీ, అంతిమ అధికారం సర్వోన్నత నాయకుడిపై ఉంటుంది. ఆయన రాష్ట్ర వ్యవహారాలన్నింటిపై చివరి నిర్ణయం తీసుకుంటారు..

    వివరాలు 

    పెజెష్కియన్ ఎవరు 

    పెజెష్కియాన్ శిక్షణ పొందిన హార్ట్ సర్జన్ , సంస్కరణవాది అధ్యక్షుడు మొహమ్మద్ ఖతామీ ఆధ్వర్యంలో ఆరోగ్య మంత్రిగా పనిచేసిన చట్టసభ సభ్యుడు.

    2009 ప్రజాస్వామ్య అనుకూల నిరసనలపై అణిచివేతకు వ్యతిరేకంగా నిలిచారు.

    2022లో మహ్సా అమిని మరణం తరువాత నైతికత(MORAL) పోలీసులు చేసిన హింసకు వ్యతిరేకంగా ఆయన గళం విప్పారు.

    దీనితో సంస్కరణలు ఆశించిన వారికి ఆశాజ్యోతిగా ఎదిగారు ఇస్లామిక్ రిపబ్లిక్ కఠినమైన దుస్తుల కోడ్‌ను అనుసరించడంలో విఫలమైనందుకు జైలు శిక్ష తర్వాత అమిని కస్టడీలో మరణించింది.

    "ఇది మా తప్పు. తాము బలవంతంగా మత విశ్వాసాన్ని అమలు చేయాలనుకుంటున్నామని అని పెజెష్కియాన్ చెప్పారు.

    వివరాలు 

    పెజెష్కియాన్ 2013 ,2021 ఎన్నికలలో అధ్యక్ష పదవికి పోటీ 

    ఎన్నికలకు ముందు, ఆయన తనను తాను ఇరానియన్లందరికీ అభ్యర్థిగా ముందుకు వచ్చారు.

    "నా మద్దతుదారులలో ఎడమ , కుడి, ప్రార్థన చేయని వారు కూడా ఉన్నారు" అని అధ్యక్ష చర్చలో ఆయన తెలిపారు.

    1994 కారు ప్రమాదంలో తన భార్య , బిడ్డ మరణించిన తరువాత అతను రాజకీయాల్లోకి ప్రవేశించారు.

    అయన 2013, 2021లో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓటమి చెందారు. పెజెష్కియాన్ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చారు. ఆయన తండ్రి అజెరి, తల్లి కుర్దిష్.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇరాన్

    తాజా

    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్
    SSMB29: మహేష్ బాబు సినిమాలో మరో తమిళ స్టార్ హీరోగా? మహేష్ బాబు

    ఇరాన్

    హిజాబ్ ఆందోళనల్లో పాల్గొన్న మరో ముగ్గురికి ఉరి ప్రపంచం
    రాఖీ సావంత్ భర్తపై మరో కేసు- ఇరాన్ విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు కర్ణాటక
    50పైగా పాఠాశాలల్లో బాలికలపై విష ప్రయోగం విద్యార్థులు
    మహిళల అణచివేతపై గళం విప్పిన పోరాటయోధురాలికి నోబెల్ శాంతి బహుమతి ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025