UK home secretary: UK కొత్త హోమ్ సెక్రటరీగా జేమ్స్ క్లవర్లి.. విదేశాంగ కార్యదర్శిగా మాజీ ప్రధాని
సుయెల్లా బ్రేవర్‌మన్‌ను తొలగించిన తర్వాత UK ప్రధాన మంత్రి రిషి సునక్ జేమ్స్ క్లీవర్లీని కొత్త హోం సెక్రటరీగా నియమించారు. జేమ్స్ క్లవర్లి గత సంవత్సరం సెప్టెంబర్ నుండి విదేశాంగ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు అయన హోమ్ సెక్రటరీగా వ్యవహరించనున్నారు. అంతకముందు, లండన్‌లో పాలస్తీనా మద్దతుదారులు చేపట్టిన ర్యాలీని నియంత్రించడంలో పోలీసుల తీరును విమర్శిస్తూ సుయెల్లా బ్రేవర్మన్ ప్రచురించిన కథనంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవ్వడంతో రిషి సునక్ బ్రేవర్మన్‌ను మంత్రి పదవి నుంచి సోమవారం తొలగించారు. బ్రిటన్ కేబినెట్‌లో బ్రేవర్మన్ సీనియర్ మంత్రి. గతంలో లిజ్ ట్రస్ ప్రభుత్వంలో ఆమె పని చేశారు. అనంతరం రిషి సునాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక.. ఆమె ఇంటీరియర్ మినిస్టర్‌గా చేశారు
UK హోమ్ సెక్రటరీగా జేమ్స్ క్లవర్లి
మాజీ ప్రధానికి విదేశాంగ కార్యదర్శి పదవి
మాజీ బ్రిటీష్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ కు UK విదేశాంగ కార్యదర్శి బాధ్యతలను అప్పగించారు. సుయెల్లా బ్రేవర్‌మాన్ తొలగించబడిన తర్వాత హోం కార్యదర్శిగా నియమించబడిన జేమ్స్ క్లీవర్లీ స్థానంలో డేవిడ్ కామెరాన్ నియమితులయ్యారు. కాగా.. ఓ మాజీ ప్రధాని, చట్టసభ్యుల్లో లేని నేతకు కేబినెట్‌లో స్థానం కల్పించడం యూకే రాజకీయాల్లో ఒక అరుదైన సందర్భంగా.తొందర్లోనే ఆయన ఎగువ సభకు నియమించనున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది.