తదుపరి వార్తా కథనం
    
     
                                                                                రిషి సునక్ తల్లి చేసిన 'బర్ఫీ'ని రుచి చూసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ
                వ్రాసిన వారు
                Stalin
            
            
                            
                                    Jun 19, 2023 
                    
                     01:42 pm
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్‌స్కీ, యూకే ప్రధాని రిషి సునక్ మధ్య ఆసక్తికర సంఘటన జరిగింది. ఇటీవల జెలెన్‌స్కీ- రిషి కలిశారు. ఈ సమయంలో తన తల్లి చేసిన భారతీయ స్వీట్ బర్ఫీని జెలెన్‌స్కీకి రిషి సునక్ రుచి చూపించారు. జెలెన్‌స్కీబర్ఫీని టేస్ట్ చేస్తున్న వీడియోను సునాక్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పంచుకున్నారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ఓ ఇంటర్వ్యూలో కూడా రిషి సునాక్ మాట్లాడారు. తన తల్లి కొన్ని భారతీయ స్వీట్లను తయారు చేసిందని, అందులో బర్ఫీ కూడా ఉందని చెప్పారు. ఇటీవల తాను జెలెన్‌స్కీని కలిసినప్పుడు అతను ఆకలితో ఉన్నట్లు కనిపించారని, అందుకే తన తల్లి చేసిన బర్ఫీని అతనితో రుచి చూపించినట్లు రిషి పేర్కొన్నారు.