Russia: రష్యా దాడుల్లో భారతీయ పౌరుడితో సహా 12 మంది మృతి: జెలెన్‌స్కీ
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్‌పై రష్యా రాత్రివేళ జరిపిన దాడుల్లో 12 మంది మృతి చెందారని, వారిలో ఒక భారతీయ పౌరుడు కూడా ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు. భారీ సంఖ్యలో జెట్ ఇంజిన్‌తో నడిచే డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో రష్యా దాడులకు పాల్పడిందని చెప్పారు. ఈ దాడుల్లో నివాస భవనాలు, పౌర మౌలిక వసతులు దెబ్బతినడంతో వేలాది మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని వెల్లడించారు. ''రష్యా దాడి ప్రభావాలను చక్కదిద్దే పనులు గత రాత్రి నుంచే అనేక నగరాలు, ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. కీవ్, చుట్టుపక్కల ప్రాంతాల్లోనే దాదాపు 350 మంది సహాయక సిబ్బంది రంగంలో ఉన్నారు'' అని జెలెన్‌స్కీ 'ఎక్స్'లో పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వొలోదిమిర్ జెలెన్‌స్కీ చేసిన ట్వీట్
In many cities and communities, work to address the aftermath of the Russian attack has been ongoing since last night – nearly 350 first responders are involved in Kyiv and the region alone. A significant number of jet-powered drones and ballistic missiles were used in the… pic.twitter.com/8cg4ik0V2F
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) September 1, 2026
వివరాలు
నలుగురు మృతి,13 మందికి గాయాలు.. ధృవీకరించిన జెలెన్‌స్కీ..
బోరిస్పిల్ నగరంలోనే నలుగురు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారని అధ్యక్షుడు జెలెన్‌స్కీ ధ్రువీకరించారు.
సోమవారం సాయంత్రం నుంచి ఒడెసా నగరం, పరిసర ప్రాంతాలపై గైడెడ్ ఏరియల్ బాంబులు, డ్రోన్లతో దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు.
కీవ్‌లోని ఓ రైల్వే డిపోపై జరిగిన దాడిలో ఏడుగురు మృతి చెందారని చెప్పారు.
ఖెర్సన్, డొనెట్స్క్, జపోరిజ్జియా, ఖార్కివ్, చెర్నిహివ్, జైటోమిర్, సుమీ, డ్నిప్రో ప్రాంతాలు కూడా రష్యా దాడులకు గురయ్యాయని జెలెన్‌స్కీ వెల్లడించారు.
వివరాలు
వైమానిక రక్షణ బలోపేతానికి మిత్రదేశాల సహకారం.. జెలెన్‌స్కీ కృతజ్ఞతలు
''మొత్తంగా 12 మంది మృతి చెందారు. వారిలో ఒక భారతీయ పౌరుడు ఉన్నారు. ఈ దాడిలో మరో పలువురు గాయపడ్డారు'' అని జెలెన్‌స్కీ తెలిపారు.
ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు సహకరిస్తున్న మిత్రదేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రష్యా దాడుల్లో ప్రాణనష్టం ఎంతమేర ఉంటుందనేది తమకు అందుతున్న సైనిక సాయంపై నేరుగా ఆధారపడి ఉంటుందని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.
''ఉక్రెయిన్‌కు బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకునే రక్షణ వ్యవస్థలు అందించేందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా శరదృతువులో ఈ సరఫరాలు మరింత పెరగడం చాలా ముఖ్యం'' అని ఆయన అన్నారు.