LOADING...
Russia-Ukraine: ఉక్రెయిన్ రైల్వే స్టేషన్‌పై రష్యా డ్రోన్ దాడి.. ప్రయాణికులకు గాయాలు 
ఉక్రెయిన్ రైల్వే స్టేషన్‌పై రష్యా డ్రోన్ దాడి.. ప్రయాణికులకు గాయాలు

Russia-Ukraine: ఉక్రెయిన్ రైల్వే స్టేషన్‌పై రష్యా డ్రోన్ దాడి.. ప్రయాణికులకు గాయాలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 04, 2025
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధ పరిస్తితులు మరింత తీవ్రత పొందుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌లోని ఉత్తర సుమీ ప్రాంతంలోని రైల్వే స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యా దళాలు డ్రోన్ల ద్వారా దాడులు నిర్వహించాయి. ఈ దాడి కారణంగా కీవ్‌కి వెళ్తున్న ప్రయాణికుల రైలు బాంబుల ధాటికి గురైంది. రైల్లోని కొన్ని బోగీలు మంటల్లో కాలిపోయాయి. ప్రస్తుతం ప్రమాదం తీవ్రత, ప్రాణ నష్టాల సంఖ్యపై పూర్తి సమాచారం అందలేదు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 30 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. మంటల్లో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

Details

రష్యాపై తీవ్రస్థాయిలో మండిపడ్డ జెలెన్‌స్కీ

ఈ దృశ్యాలను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రష్యాపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జెలెన్‌స్కీ ప్రకారం 'సుమీ ప్రాంతంలోని రైల్వే స్టేషన్‌పై రష్యా డ్రోన్ దాడులు జరిపింది. ఇందులో అనేక మంది గాయపడ్డారు. సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకొని రష్యా దాడులు కొనసాగిస్తోంది. ఇది ప్రపంచం గమనించవలసిన అంశం. ప్రతిరోజూ రష్యా ఎంతోమంది అమాయక ప్రజలను చంపుతోంది. ఐరోపా, అమెరికా నుంచి ఎన్నో ప్రకటనలు వస్తున్నా, మాటలు మాత్రమే సరిపోవు. ఇప్పుడు బలమైన చర్యలు అవసరమని జెలెన్‌స్కీ అన్నారు.