Loading...
South Korea-Ukraine: కిమ్ సైనికుల అప్పగింతపై వివాదం.. జెలెన్‌స్కీ ప్రకటనపై దక్షిణ కొరియా ఆగ్రహం
జెలెన్‌స్కీ ప్రకటనపై దక్షిణ కొరియా ఆగ్రహం

South Korea-Ukraine: కిమ్ సైనికుల అప్పగింతపై వివాదం.. జెలెన్‌స్కీ ప్రకటనపై దక్షిణ కొరియా ఆగ్రహం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 28, 2026
11:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ చేసిన ఓ ప్రకటనపై దక్షిణ కొరియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రష్యా తరఫున యుద్ధంలో పాల్గొని ఉక్రెయిన్‌ బలగాలకు చిక్కిన ఇద్దరు ఉత్తరకొరియా సైనికులను దక్షిణ కొరియాకు అప్పగించినట్లు జెలెన్‌స్కీ ఇటీవల ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో వెల్లడించారు. అయితే.. యుద్ధ ఖైదీల బదిలీకి సంబంధించి ఉక్రెయిన్‌తో తమకు గోప్యతా ఒప్పందం ఉందని దక్షిణ కొరియా చెబుతోంది. ఈ నేపథ్యంలో జెలెన్‌స్కీ బహిరంగంగా చేసిన ప్రకటనపై ఆ దేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌ తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.

వివరాలు 

గోప్యతా ఒప్పందం ఉల్లంఘించారంటూ..

ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సైన్యంలో పనిచేస్తూ రష్యా తరఫున పోరాడిన ఇద్దరు సైనికులను ఉక్రెయిన్‌ దళాలు బందీలుగా పట్టుకున్నాయి.

అనంతరం వారిని దక్షిణ కొరియాకు అప్పగించిన విషయాన్ని ఐరాస సర్వప్రతినిధి సభ సమావేశాల సందర్భంగా జెలెన్‌స్కీ వెల్లడించారు.

అయితే ఈ అంశాన్ని ఇలా బహిరంగంగా ప్రకటించడం తమ రెండు దేశాల మధ్య ఉన్న గోప్యతా ఒప్పందానికి విరుద్ధమని దక్షిణ కొరియా పేర్కొంది.

జెలెన్‌స్కీ ఏకపక్షంగా ఈ విషయాన్ని వెల్లడించడమే కాకుండా.. ఇలాంటి రహస్య ఒప్పందం తమ మధ్య లేదని పేర్కొనడంపైనా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడి కార్యాలయం తెలిపింది.

వివరాలు 

కుటుంబాల భద్రతకు ముప్పు

అంతర్జాతీయ చట్టాలు, మానవతా సూత్రాలకు అనుగుణంగా సైనికుల బదిలీకి సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచడమే ఈ ఒప్పందం ఉద్దేశమని స్పష్టం చేసింది.

సైనికుల గుర్తింపు, ఇతర వివరాలు బహిర్గతమైతే ఉత్తరకొరియాలో ఉన్న వారి కుటుంబ సభ్యుల భద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని దక్షిణ కొరియా ఆందోళన వ్యక్తం చేసింది.

అందుకే ఈ బదిలీకి సంబంధించిన సమాచారాన్ని రహస్యంగా ఉంచాలని రెండు దేశాల మధ్య అవగాహన ఉన్నట్లు తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు 

2025 జనవరిలో బందీగా..

ఇదిలా ఉండగా.. రష్యాలోని కుర్స్క్‌ ప్రాంతంలో 2025 జనవరిలో ఇద్దరు ఉత్తరకొరియా సైనికులను ఉక్రెయిన్‌ బలగాలు బందీలుగా పట్టుకున్నాయి.

అనంతరం తాము దక్షిణ కొరియాకు వెళ్లాలనుకుంటున్నామని ఆ ఇద్దరు సైనికులు కోరినట్లు తెలుస్తోంది.

వారి అభ్యర్థన మేరకే వారిని దక్షిణ కొరియాకు అప్పగించినట్లు సమాచారం.

ADVERTISEMENT