Loading...
Saudi Arabia: రియాద్ ఎయిర్‌పోర్టుపై మళ్లీ క్షిపణి దాడి.. విమానాశ్రయ కార్యకలాపాలు నిలిపివేత
రియాద్ ఎయిర్‌పోర్టుపై మళ్లీ క్షిపణి దాడి..విమానాశ్రయ కార్యకలాపాలు నిలిపివేత

Saudi Arabia: రియాద్ ఎయిర్‌పోర్టుపై మళ్లీ క్షిపణి దాడి.. విమానాశ్రయ కార్యకలాపాలు నిలిపివేత

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 12, 2026
08:11 am

ఈ వార్తాకథనం ఏంటి

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్‌ ఖలీద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి దాడికి పాల్పడ్డారు. ఆదివారం జరిగిన ఈ దాడి విమానాశ్రయంపై జరిగిన మూడో దాడిగా అధికారులు పేర్కొన్నారు. విమానాశ్రయంలోని ప్రయాణికుల టెర్మినల్‌ను క్షిపణి ఢీకొట్టినట్లు వెల్లడించారు. అయితే, ముందుగానే విమానాశ్రయాన్ని మూసివేయడంతో ఈ దాడిలో ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.

వివరాలు 

క్షతగాత్రుల్లో 10 మందికిపైగా భారతీయులు

శనివారం జరిగిన క్షిపణి దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికిపైగా గాయపడ్డారు.

క్షతగాత్రుల్లో 10 మందికిపైగా భారతీయులు ఉన్నట్లు సమాచారం.గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని మరిన్ని దాడులు చేస్తామని హౌతీలు హెచ్చరించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఇందులో భాగంగా కింగ్‌ ఖలీద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలను ఆదివారం రాత్రి 9 గంటల వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

రాజధాని రియాద్‌లోని పాఠశాలల్లో కనీసం వారం రోజులపాటు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని ఆదేశించింది.

శనివారం విమానాశ్రయంలో దేశీయ విమానాల రాకపోకలకు ఉపయోగించే మూడో, నాలుగో టెర్మినళ్లపై దాడి జరిగింది.

ఈ ఘటనలో నలుగురు సౌదీ పౌరులు సహా పలువురు విదేశీయులు ప్రాణాలు కోల్పోయారు.

వివరాలు 

సౌదీ అరేబియాలో గగనతల రక్షణ వ్యవస్థలకు కొరత

మృతుల్లో భారత్‌,అమెరికా, ఈజిప్ట్‌,జోర్డాన్‌,సిరియా, సూడాన్‌, బంగ్లాదేశ్‌, పాలస్తీనాకు చెందిన వారు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

గాయపడిన వారికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. నాలుగు రోజుల క్రితం ఇదే విమానాశ్రయంపై జరిగిన దాడిలో ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే.

మరోవైపు, సౌదీ అరేబియాలో గగనతల రక్షణ వ్యవస్థలకు కొరత ఏర్పడినట్లు సమాచారం.

ఇరాన్‌తో యుద్ధం కారణంగా అమెరికా వద్ద కూడా ఈ వ్యవస్థలు తగినన్ని లేకపోవడంతో సౌదీ ప్రభుత్వం ఫ్రాన్స్‌, బ్రిటన్‌,ఈజిప్ట్‌లను వాటిని సరఫరా చేయాలని కోరినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా,సౌదీ అరేబియా ఆదివారం యెమెన్‌ రాజధాని సనాపై జరిపిన వైమానిక దాడుల్లో ఆరుగురు మరణించినట్లు హౌతీ తిరుగుబాటుదారులు ఆరోపించారు.

రియాద్‌ విమానాశ్రయంపై హౌతీలు వరుసగా దాడులు చేయడాన్ని భారత్‌ ఖండించింది.

ADVERTISEMENT

వివరాలు 

హైదరాబాద్‌ ఐటీ నిపుణుడు మృతి

రియాద్‌ విమానాశ్రయంపై శనివారం జరిగిన దాడిలో హైదరాబాద్‌లోని మెహిదీపట్నానికి చెందిన ఐటీ నిపుణుడు మహమ్మద్‌ యూసుఫ్‌ (46) ప్రాణాలు కోల్పోయారు.

ఉమ్రా యాత్ర కోసం మదీనా వెళ్లేందుకు ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఈ క్రమంలో మధ్యాహ్నం జరిగిన క్షిపణి దాడిలో యూసుఫ్‌ తీవ్రంగా గాయపడి మృతి చెందారు.

ఈ ఘటనలో ఆయన భార్య, ఇద్దరు కుమారులు,కుమార్తె గాయపడ్డారు. వీరిని రియాద్‌లోని ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

యూసుఫ్‌ కుమారుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బాధిత కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

ADVERTISEMENT