Saudi Crown Prince : హూతీల దాడులతో ఉలిక్కిపడిన సౌదీ.. ప్యాలస్‌లు మారుస్తున్న యువరాజు
ఈ వార్తాకథనం ఏంటి
సౌదీ అరేబియాపై హూతీ తిరుగుబాటుదారులు గత పదేళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రంగా దాడులకు దిగుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. వరుస దాడులతో సౌదీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ (MBS) భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం ఏ రాజభవనంలో ఉంటున్నారనే విషయం కూడా బయటకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. యువరాజు రక్షణ కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన భద్రతా బృందం నిరంతరం అప్రమత్తంగా ఉంటోంది. పరిస్థితులకు అనుగుణంగా ఆయనను బంకర్లకు, అత్యంత పటిష్ఠమైన భద్రత కలిగిన వేర్వేరు రాజభవనాలకు తరలిస్తున్నట్లు సమాచారం.
వివరాలు
రియాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి
ఆయన బస చేసే ప్రదేశాలను తరచూ మార్చడం ద్వారా భద్రతాపరమైన ముప్పులను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలు, ఇంధన మౌలిక సదుపాయాలు, నౌకామార్గాలను లక్ష్యంగా చేసుకుని హూతీలు దాడులకు పాల్పడుతున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి.
ఇటీవల రియాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనలో దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.
ఈ దాడి తర్వాత యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు కల్పిస్తున్న భద్రతను మరింత పెంచినట్లు అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది.
వివరాలు
సౌదీ అరేబియాలో రక్తదాన కార్యక్రమం
భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు యువరాజు బహిరంగ కార్యక్రమాలకు హాజరుకావడాన్ని కూడా తగ్గించినట్లు తెలుస్తోంది.
గతవారం సౌదీ అరేబియాలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు.
ఆ కార్యక్రమం తర్వాత నుంచి మహమ్మద్ బిన్ సల్మాన్ బహిరంగంగా ఎక్కడా కనిపించలేదని అంతర్జాతీయ మీడియా కథనం పేర్కొంది.
వరుస దాడుల నేపథ్యంలో ఆయన భద్రత కోసం తీసుకుంటున్న చర్యలు, బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.