
Japan: జపాన్ ప్రధానిగా తిరిగి షిగేరు ఇషిబా ఎన్నిక
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్‌కు చెందిన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ) నాయకుడు షిగేరు ఇషిబా, జపాన్ డైట్‌లోని ఉభయ సభల్లో అత్యధిక ఓట్లను సాధించి, దేశ ప్రధానమంత్రిగా సోమవారం తిరిగి ఎన్నికయ్యారు.
ప్రధానమంత్రిని ఎన్నుకోవడానికి జపాన్ పార్లమెంట్, సోమవారం మధ్యాహ్నం అసాధారణ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ఇషిబా తిరిగి విజయం సాధించారు.
ఈ సందర్భంగా,ఇషిబా తమ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ"నేను జపాన్ 103వ ప్రధానమంత్రిగా నియమించబడ్డాను. దేశీయ,అంతర్జాతీయ స్థాయిలో ప్రజలకు సేవ చేయడానికి నేను నా వంతు కృషి చేస్తాను."అని పేర్కొన్నారు.
హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో జరిగిన ఓటింగ్‌లో 67 ఏళ్ల ఇషిబా 221 ఓట్లు పొందారు.
233 ఓట్ల మెజారిటీ అవసరం అయినప్పటికీ, నోడాను అధిగమించి ఇషిబా జపాన్ 103వ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జపాన్ 103వ ప్రధానమంత్రిగా ఎన్నికైనట్లు పోస్టు
Shigeru Ishiba formally re-elected Japan's Prime Minister
— ANI Digital (@ani_digital) November 11, 2024
Read @ANI Story l https://t.co/KXVFYU37bw#Japan #ShigeruIshiba pic.twitter.com/Q1PESb9jbe