Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో శివం ఢోల్ బ్యాండ్ హైలైట్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడిగా మరొకసారి విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ఆయన రెండవ టర్మ్‌కు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఈ సందర్భంగా ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవానికి ముందు క్యాపిటల్ హిల్ నుండి వైట్ హౌస్ వరకు జరిగే పరేడ్‌లో భారతీయ అమెరికన్ ఢోల్ బ్యాండ్ సందడి చేయనున్నట్లు సమాచారం.
టెక్సాస్ నుంచి పనిచేస్తున్న 'శివం ఢోల్ తాషా పాఠక్'ను వైట్ హౌస్ నుంచి ప్రత్యేక ఆహ్వానం లభించింది.
ఈ ప్రదర్శన ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే వేళ ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తింపు తెచ్చేలా ఉండనుంది.
శివం ఢోల్ బ్యాండ్ ప్రపంచ దేశాలకు తమ హై ఎనర్జీ ప్రదర్శనను పరిచయం చేయనున్నట్టు ఆనందం వ్యక్తంచేశారు.
Details
47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం
నవంబర్‌లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డొమినిక్ ట్రంప్ కమలా హారిస్ ను ఓడించి ఘన విజయం సాధించారు.
జనవరి 20న ట్రంప్ 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల అధినేతలు హాజరుకానున్నట్లు సమాచారం.
అమెరికాలో ఎన్నికల ప్రక్రియ వివిధ దేశాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఎన్నికలు నవంబర్ 5న జరగుతాయి. కానీ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం జనవరి 20న జరుగుతుంది.
ఈ సుదీర్ఘ సమయం వెనుక దేశ రాజ్యాంగ నిబంధనలు, గత అనుభవాలు ఉన్నాయి. 1933లో, 'గ్రేట్ డిప్రెషన్' సమయంలో ప్రమాణస్వీకారానికి మధ్య సమయాన్ని మూడు నెలలకు తగ్గించారు.