Loading...
Russia-China AGCC Project: రష్యాలోని ఏజీసీసీ ప్లాంట్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి, 152 మందికి గాయాలు
రష్యాలోని ఏజీసీసీ ప్లాంట్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి, 152 మందికి గాయాలు

Russia-China AGCC Project: రష్యాలోని ఏజీసీసీ ప్లాంట్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి, 152 మందికి గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 27, 2026
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యాలోని అముర్ ప్రాంతంలో మంగళవారం భారీ పారిశ్రామిక ప్రమాదం చోటుచేసుకుంది. స్వోబోడ్నీ సమీపంలో ఉన్న అముర్ గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్ (AGCC)లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. 152 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన 36 మందిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో తొమ్మిది మంది ఆచూకీ ఇంకా లభించలేదని అధికారులు తెలిపారు. మృతుల్లో ఆరుగురు చైనా పౌరులు ఉన్నట్లు ఏజీసీసీ యాజమాన్యం వెల్లడించింది. ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్‌లో కార్యకలాపాల ప్రారంభానికి ముందు నిర్వహించే ప్రీ-కమిషనింగ్ పనులు కొనసాగుతున్నాయి.

వివరాలు 

రష్యా-చైనా సంయుక్త ప్రాజెక్టు

ఈ క్రమంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో పాటు.. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

స్వోబోడ్నీ సమీపంలో నిర్మించిన అముర్ గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్‌ను రష్యా, చైనా కలిసి అభివృద్ధి చేశాయి.

సుమారు 10 బిలియన్ డాలర్ల వ్యయంతో ఈ భారీ ప్రాజెక్టును చేపట్టారు.

రష్యాకు చెందిన పెట్రోకెమికల్ సంస్థ సిబూర్, చైనా ప్రభుత్వ ఆధీనంలోని చమురు, గ్యాస్ దిగ్గజం సినోపెక్ ఇందులో కీలక భాగస్వాములుగా ఉన్నాయి.

వివరాలు 

ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమల్లో ఒకటిగా..

పాలిథిలీన్, పాలీప్రొపిలీన్‌ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే ప్రపంచంలోని అతిపెద్ద పరిశ్రమల్లో ఒకటిగా ఏజీసీసీని రూపొందించారు.

నిర్మాణ దశలో ప్రతిరోజూ దాదాపు 30,000 మంది కార్మికులు ప్రాజెక్టు పనుల్లో పాల్గొనేవారు.

సమీపంలోని అముర్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్ (Amur GPP) నుంచి ముడి పదార్థాలను తీసుకుని.. వాటిని ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించే ఉత్పత్తులుగా మార్చేలా ఏజీసీసీని తీర్చిదిద్దారు.

ADVERTISEMENT

వివరాలు 

ఏటా 27 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం

ఏజీసీసీ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత భారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది.

ప్రతి సంవత్సరం సుమారు 23 లక్షల టన్నుల పాలిథిలీన్‌ను ఉత్పత్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు.

దీంతో పాటు మరో నాలుగు లక్షల టన్నుల పాలీప్రొపిలీన్‌ను తయారు చేయనుంది.

ఇంతటి భారీ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో కార్యకలాపాలు ప్రారంభానికి ముందే పేలుడు సంభవించడం తీవ్ర కలకలం రేపింది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఏజీసీసీ ప్లాంట్‌లో భారీ పేలుడు.. ఆరుగురు చైనా కార్మికులు సహా ఏడుగురి మృతి

ADVERTISEMENT