Page Loader
ఇంట్లో నిర్బంధించి, తిండి పెట్టకుండా 1000 కుక్కలను చంపేసిన వృద్ధుడు
ఇంట్లో నిర్బంధించి, తిండి పెట్టకుండా 1000 కుక్కలను చంపేసిన వృద్ధుడు

ఇంట్లో నిర్బంధించి, తిండి పెట్టకుండా 1000 కుక్కలను చంపేసిన వృద్ధుడు

వ్రాసిన వారు Stalin
Mar 09, 2023
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

తిండి పెట్టకుండా, కడుపు మాడ్చి దాదాపు 1000 కుక్కుల చావుకు కారణమయ్యాడు ఓ వృద్ధుడు. దక్షిణ కొరియాలోని నార్త్ వెస్ట్ ప్రావిన్స్‌లోని ఓ ఇంట్లో వెలుగుచూసిన ఈ ఘటన సంచలనంగా మారింది. జియోంగ్‌గీ ప్రావిన్స్‌లోని యాంగ్‌పియోంగ్‌కు చెందిన ఓ వ్యక్తి కుక్క కనపడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా, ఓ వృద్ధుడి ఇంట్లో వందలాదిగా చనిపోయిన కుక్కులను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వందల సంఖ్యలో కుక్కల కళేబరాలను స్వాధీనం చేసుకున్నట్లు హాంగ్-కాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (ఎస్‌సీఎంపీ) నివేదించింది. విషయం తెలిసిన వెంటనే జంతు సంరక్షణ కేంద్రానికి సమాచారం ఇచ్చిన పోలీసులు, కొన ఊపిరితో ఉన్న కుక్కలను కాపాడారు.

దక్షిణ కొరియా

సంరక్షణ కోసం నిందితుడికి కుక్కలను అప్పజెప్పిన యజమానులు

వయసు మళ్లిన, సంతోనోత్పత్తి ఆగిపోయిన కుక్కలను యజమానులు సంరక్షణకోసం ఈ వృద్ధుడికి అప్పజెప్పారు. వాటి సంరక్షించేందుకు నిందితుడికి యజమానులు ప్రతి కుక్కకు 10,000వాన్ (7.70డాలర్లు) చెల్లించారని జంతు సంరక్షణ కార్యకర్తలు చెప్పారు. అయితే 2020 నుంచి ఆ వృద్ధుడు సంరక్షణ కోసం అప్పగించిన కుక్కలను తిండి పెట్టకుండా చంపేశారని ఆరోపించారు. కుక్కల కళేబరాలు, బోన్స్, రబ్బరు పెట్టేల్లో దాచిన మృతదేహాలతో వృద్ధుడి ఇల్లు భయంకరంగా ఉందని జంతు సంరక్షణ కార్యకర్తలు వివరించారు. బతికి ఉన్న కుక్కలు కూడా చర్మ వ్యాధులు, పోషకాహార లోపంతో బాధపడుతున్నాయని వెల్లడించారు. దక్షిణ కొరియాలో ఒక దశాబ్దంలో జంతువులపై వేధింపుల కేసులు అనేక రెట్లు పెరిగాయి. 2010లో 69గా ఉన్న కేసులు 2019లో 914కి పెరిగాయని ఎస్‌సీఎంపీ తెలిపింది.