LOADING...
Greenland: మదురో నిర్బంధం వేళ వార్తల్లో గ్రీన్‌లాండ్‌.. చర్చనీయాంశమైన కేటీ మిల్లర్ పోస్టు
మదురో నిర్బంధం వేళ వార్తల్లో గ్రీన్‌లాండ్‌.. చర్చనీయాంశమైన కేటీ మిల్లర్ పోస్టు

Greenland: మదురో నిర్బంధం వేళ వార్తల్లో గ్రీన్‌లాండ్‌.. చర్చనీయాంశమైన కేటీ మిల్లర్ పోస్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 05, 2026
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో (Nicolas Maduro) అరెస్టు , ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే,పద్ధతిని మార్చుకోకపోతే వెనెజువెలా వంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తాయని, లాటిన్ అమెరికా దేశాలకు అమెరికా హెచ్చరించిందని తెలిసిందే. ఇలాంటి సమయంలో గ్రీన్‌లాండ్‌ (Greenland)గురించి అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ సతీమణి కేటీ మిల్లర్ పెట్టిన పోస్టు కలకలం రేపుతోంది. దీనిపై డెన్మార్క్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవానికి ఏమైందంటే.. డెన్మార్క్‌ పాలనలో ఉన్న గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ పలు సార్లు ప్రకటించారు. తాజాగా,కేటీ మిల్లర్ అమెరికా జెండా రంగులలో గ్రీన్‌లాండ్‌ మ్యాప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో 'త్వరలో (SOON)'అని కామెంట్ పెట్టడం విశేషం.

వివరాలు 

బెదిరింపులు ఆపండి: డెన్మార్క్‌ ప్రధాని 

మదురో కస్టడీ వేళ.. ఈ పోస్టు కలకలం రేపుతోంది. కేటీ, ట్రంప్ ప్రభుత్వం మొదటి దశలో హోంశాఖ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా పని చేశారు. ఇలా పోస్టు వచ్చిన తర్వాత, అమెరికాలోని డెన్మార్క్ రాయబారి జెన్సర్ మోయెల్లర్ స్పందిస్తూ, ''డెన్మార్క్ ప్రాదేశిక సమగ్రతను ఇతర దేశాలు గౌరవించాలి'' అని స్పష్టంగా చెప్పారు. అమెరికా (USA) బెదిరింపులను డెన్మార్క్‌ తొలి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ. ''మా జాతీయ భద్రతకు గ్రీన్‌లాండ్ అవసరం'' అని అన్నారు. దీనిపై డెన్మార్క్‌ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్‌ (Mette Frederiksen) స్పందిస్తూ, ''బెదిరింపులు ఆపండి. గ్రీన్‌లాండ్‌పై వ్యాఖ్యలు చేయడం పూర్తిగా అర్థరహితం. యూఎస్‌ఏకు ఎలాంటి హక్కు లేదు'' అని స్పష్టంగా చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కేటీ మిల్లర్ చేసిన ట్వీట్ 

Advertisement