Nikitha Godishala: అమెరికాలో తెలుగమ్మాయి నిఖిత దారుణ హత్య.. దర్యాప్తులో కీలక విషయాలు!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని మేరీల్యాండ్‌లో 27 ఏళ్ళ తెలుగమ్మాయి నిఖిత గోడిశాలను ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ దారుణంగా హత్య చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిఖిత తండ్రి ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ చివరిగా నాకూతురు డిసెంబరు 31న హ్యాపీ న్యూ ఇయర్ డాడీ అని ఫోన్ చేసింది. నాలుగేళ్ల క్రితం నా కూతురు అమెరికాకు చదువుకోడానికి వెళ్లింది. కొంతకాలం నుంచి జాబ్ చేసేది.నా కూతురి వద్ద నుంచి డబ్బులు అడిగి తీసుకునే వాడే అర్జున్ శర్మ. కొంతకాలం తర్వాత నిఖితను హత్య చేసి, ఆమె అదృశ్యమైందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆతర్వాత ఇండియాకు పారిపోయాడు. నా కూతురికి జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదు. ఆమె మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావాలని కోరుతున్నానన్నారు.
Details
డబ్బులే కారణమా
పోలీసుల దర్యాప్తు ప్రకారం, నిఖితకు అర్జున్ శర్మ 4,500 డాలర్లు అప్పుగా ఇచ్చి ఉండటం తెలిసిందే. కొంతకాలం తర్వాత 3,500 డాలర్లు తిరిగి ఇచ్చాడు. మిగిలిన 1,000 డాలర్ల కోసం నిఖిత తిరిగి అడిగినప్పటికి, అర్జున్ ఆమెను హత్యకు పాల్పడ్డాడని సమాచారం. అపార్ట్‌మెంట్‌లో దారుణ హత్య నిఖిత ఎలికాట్ సిటీలోని కొలంబియా అపార్ట్‌మెంట్‌లో కత్తితో హత్య చేశారు. అదే రోజు అర్జున్ శర్మ భారతదేశానికి పారిపోయాడు. తమిళనాడులో ఇంటర్‌పోల్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. హోవార్డ్ కౌంటీ పోలీసులు దర్యాప్తులో నిఖితను అర్జున్ హత్య చేశాడని నిర్ధారించారు.
Details
భారత ప్రభుత్వం చర్యలు
నిఖిత డిసెంబరు 31న అదృశ్యమవడంతో, ఆమె స్నేహితులు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేశారు. జనవరి 2న నిఖిత మృతదేహాన్ని కనుగొన్నారు. నిఖిత కుటుంబ సభ్యులతో భారత రాయబారి కార్యాలయం సంప్రదింపులు కొనసాగిస్తోంది. త్వరితంగా నిఖిత మృతదేహాన్ని హైదరాబాద్**కు రప్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆమె పేరెంట్స్ ప్రస్తుతం లాలాగూడలోని శ్రీ మిత్ర ప్రిన్స్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. నిఖిత హత్యకు గల స్పష్ట కారణాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. పోలీసులు, ఇంటర్‌పోల్, భారత ఆంబాసీ సమన్వయంలో దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.